తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ

by srinivas |
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ
X

దిశ, వెబ్‎డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి.

శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భద్రాచలం, రాజమండ్రి, నరసాపురం దగ్గర గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక వేములవాడ రాజన్న ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నారు ఆలయ అధికారులు. రాత్రి 7 గంటలకు జ్వాలాతోరణం, 9 గంటలకు నిశిపూజ అనంతరం మహాపూజ చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed