శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

by srinivas |
శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
X

దిశ, ఏపీ బ్యూరో: కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు స్వర్ణ కవచాలం కృత దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కనకదుర్గ అమ్మవారిని శనివారం దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పుకొచ్చారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పది వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో ముందుగా టికెట్ బుక్ చేసుకున్న వారు మాత్రమే అమ్మవారి దర్శనానికి రావాలని ఆయన కోరారు.

Advertisement

Next Story