అమెరికాలో మారు మోగిన అయ్యప్ప నామస్మరణ

by Aamani |
Devotees, Ayyappa Swamy
X

దిశ, తాండూర్: అమెరికాలోని వాషింగ్టన్ డీసీ సమీపంలోని మేరీ ల్యాండ్ శ్రీశివ, విష్ణు ఆలయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప స్వాములు ఇరుముడి పూజలు చేసి దీక్ష విరమణ చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ తమ భక్తి, భావాలను చాటుకున్నారు. దీక్ష విరమణ సందర్భంగా శ్రీ శివ విష్ణు ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున రావడంతో అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారు మోగాయి. తెలంగాణకు చెందిన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్ షిప్‌కు చెందిన జడప శంకర్ స్వామి అమెరికాలో దీక్ష చేపట్టినట్లు తెలిపారు.

Advertisement

Next Story