భక్తులు రగిలిపోతున్నారు.. వేములవాడ గుడిలో మౌఢ్యం

by Sridhar Babu |   ( Updated:2021-03-05 08:50:12.0  )
భక్తులు రగిలిపోతున్నారు.. వేములవాడ గుడిలో మౌఢ్యం
X

దిశ, వేములవాడ: దక్షిణ కాశీగా వెలుగొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అపచారం జరిగింది. గర్భగుడిలో ఆలయ అధికారులు వెండి కైలాస పర్వత పటం ఏర్పాటు చేశారు. దీనిపై భక్తులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారులు తేరుకొని దానిని అక్కడి నుంచి తరలించారు. అయితే ఏదైనా గర్భగుడిలో ఏర్పాటు చేసే క్రమంలో స్థానాచార్యులు, అర్చకులను సంప్రదించకుండా అధికారులు ఏర్పాటు చేయడంపై భక్తులు, పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో మార్పుచేర్పులు చేయాల్సి వస్తే శృంగేరి పీఠాధిపతి అనుమతితో చేయాల్సి ఉండగా, అలా కాకుండా ఓ భక్తుడు ఇచ్చిన వెండి పటం గర్భాలయంలో ఏర్పాటుచేశారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు.

ఆలయ ప్రతిష్టకు భంగం చేస్తే ఊరుకోం

ఆలయ కట్టుబాట్లు, ఆగమశాస్ర్తం సంప్రదాయం పాటించకుండా ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా చూస్తే ఊరుకోం. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతాం.–ప్రతాప రామకృష్ణ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు

విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం

ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఆలయ ప్రతిష్టకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రత ఏర్పాటుచేస్తాం.–కృష్ణప్రసాద్, ఈవో వేములవాడ

Advertisement

Next Story

Most Viewed