చంద్రబోస్ "ఎంత సక్కగ రాశారో".. దేవి మ్యూజికల్ అభినందన

by Shyam |
చంద్రబోస్ ఎంత సక్కగ రాశారో.. దేవి మ్యూజికల్ అభినందన
X

పాటల రచయిత చంద్రబోస్ ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. తన సినీ ప్రయాణంలో వందల పాటలు రాసిన ఆయన.. తెలుగు పరిశ్రమలో ప్రత్యేక స్థానం పొందారు. మెలోడీ పాటైనా సరే.. కెవ్వు కనిపించే మాస్ బీట్ అయినా సరే.. చంద్రబోస్ కలం పట్టిందంటే సూపర్ హిట్టే. చంద్రబోస్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ వీడియో ట్రీట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్.

రంగస్థలం చిత్రంలోని ఎంత సక్కాగున్నవే లచ్మి పాట ట్యూన్ కు స్పెషల్ లిరిక్స్ యాడ్ చేసి చంద్రబోస్ కు అంకితం ఇచ్చారు దేవి. “ఒకటి రెండు కాదు.. మూడు నాలుగు కాదు.. 25 ఏళ్లుగా ఎన్నెన్ని పాటలు.. ఎంత సక్కగ రాశారో.. చంద్రబోస్ ఎంత సక్కగ రాశారో..మనసును ముద్దాడే మృదువైన పాటైనా .. ఒంటిని ఆడించే అలలాంటి పాటైనా ఎంత సక్కగ రాశారో.. చంద్రబోస్ ఎంత సక్కగ రాశారో..” అంటూ తన ప్రియమైన వ్యక్తికి శుభాకాంక్షలు తెలిపారు.

కాగా 1995 లో తాజ్ మహల్ సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన చంద్రబోస్.. తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో ఆణిముత్యాలు లాంటి పాటలు అందించారు.

Advertisement

Next Story