- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెట్రోల్, డీజిల్ ధరలపై దేవినేని ఉమా ఫైర్
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: పెట్రో ఉత్పత్తులపై పన్నుల భారం వేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రస్థానంలో నిలిచిందని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని విమర్శించారు. లీటర్ ధర సెంచరీ దాటినా పన్నులు తగ్గించే ప్రసక్తే లేదని ప్రభుత్వం అంటోందని మాజీమంత్రి దేవినేని ఉమా ట్విటర్ వేదికగా విమర్శల దాడి చేశారు.
కరోనా కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నుల భారాన్ని తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెంచుకుంటూ పోతుందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం రోడ్ సెస్, వ్యాట్ పేరుతో అదనపు భారాన్ని మోపుతోందని విరుచుకుపడ్డారు. అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉన్న ఏపీ.. పన్నుల మోత విషయంలో మాత్రం మొదటి స్థానంలో ఉన్న మాట నిజం కాదా? అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
Advertisement
Next Story