జగన్‌పై దేవినేని ఉమా ఫైర్.. ఏమన్నాడంటే..?

by srinivas |
జగన్‌పై దేవినేని ఉమా ఫైర్.. ఏమన్నాడంటే..?
X

దిశ, అమరావతి బ్యూరో: దళిత రైతుల భూముల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. మైలవరం మండలం చండ్రగూడెం గ్రామంలో “సెంటుభూమి” పథకం పేరుతో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు అధికారులను అడ్డం పెట్టుకొని నలభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న దళిత రైతుల భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఆ రైతుల ఆర్తనాదాలు తాడేపల్లి రాజప్రసాదానికి వినబడడం లేదా అని ప్రశ్నించారు. వైసీపీ నేతల ఆగడాలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండంటూ అంటూ దేవినేని ట్విట్ చేశారు.

Advertisement

Next Story