ఈఎస్ఐ స్కామ్‌లో దేవికకు బెయిల్

by Shyam |
ఈఎస్ఐ స్కామ్‌లో దేవికకు బెయిల్
X

దిశ, వెబ్‌డెస్క్: సంచలనం సృష్టించిన తెలంగాణ ఈఎస్ఐ కుంభకోణం కేసులో మాజీ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంతకు సోమవారం ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మందుల కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఈనెల 4న దేవికారాణితో పాటు మరో 8మందిని ఏసీబీ మరోసారి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈకేసును ఈడీతో పాటు ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తుండగా… కొద్దిరోజులు క్రితం హైదరాబాద్‌ పంజాగుట్టలోని ఓ బంగారం షాపులో దేవికారాణి రూ.7కోట్ల మేరకు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ విషయంపై దేవికారాణి భర్తతో పాటు నగల షాపు యజమానిని ఈడీ విచారించింది.

Advertisement

Next Story