తండ్రి సత్యమూర్తికి దేవిశ్రీ సంగీత నివాళి

by Shyam |
తండ్రి సత్యమూర్తికి దేవిశ్రీ సంగీత నివాళి
X

హుషారైన పాటలు, అంతకుమించిన రీరికార్డింగ్‌తో సినిమాకు కొత్త ఫ్లేవర్‌ను యాడ్ చేయడంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ఎక్స్‌పర్ట్. ఆయనకు తన తండ్రి స‌త్య‌మూర్తి అంటే ఎంతిష్టమో తెలిసిందే. గతంలో దేవిశ్రీ స్వయంగా రాసి, పాడిన ‘ఏ కష్టమెదురొచ్చినా..’ అనే పాట తన తండ్రిపై అతనికున్న ప్రేమను తెలియజేస్తుంది. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ అని చెప్పుకోవడం ఎప్పుడూ గర్వంగా ఉంటుందని చెబుతుంటాడు దేవి. ఇక తన తండ్రి జయంతిని మ్యూజికల్‌గా జరుపుకుందామని సోషల్ మీడియా వేదికగా ఇదివరకే చెప్పిన దేవి.. ఆదివారం అందుకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు. జయంతి సందర్భంగా తనదైన స్టైల్‌లో సంగీతంతో తండ్రి సత్యమూర్తికి నివాళులర్పించారు.

‘హ్యాపీ మ్యూజికల్ బర్త్ డే డియరెస్ట్ డాడీ’ అంటూ వాళ్ల నాన్నకు విషెస్ చెబుతూ.. రాక్‌స్టార్ దేవి ఓ వీడియో విడుద‌ల చేశాడు. యూఎస్‌ఏలో ఓ షో కోసం శ్రద్దా దాస్‌తో కలిసి రాఖీ రాఖీ సాంగ్‌ రిహార్సల్‌ చేస్తున్న వీడియోను దేవిశ్రీ పోస్ట్‌ చేశారు. అంతేకాదు తండ్రిని స్మరించుకుంటూ ఆయనతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసుకున్నాడు. ‘ద లెజెండరీ రైటర్ శ్రీ సత్యమూర్తి గారు మీకు వందనాలు.. మీ కొడుకుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. లవ్ యూ ఆల్వేస్ అండ్ మిస్ యూ’ అని దేవి తన ట్విటర్‌లో రాసుకొచ్చారు.

వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ సినిమాకు బ్లాక్ బస్టర్ పాటలు అందించిన దేవి.. ప్రస్తుతం బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘పుప్ప‌’కు సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed