- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీ ప్రజలు అలర్ట్.. ముంచుకొస్తున్న ముప్పు
దిశ, ఏపీ బ్యూరో: గులాబ్ తుఫాను ఉత్తరాంధ్రప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి తుఫానుగా మారింది. దానికి గులాబ్‌గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తుపాను తీరం వైపు దూసుకొస్తుంది. గులాబ్ తుఫాను సోమవారం ఒడిశాలో తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో పెనుగాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పొలాకి మండలం సముద్ర తీర ప్రాంతాలైన గుల్లవానిపేట, గుప్పిడిపేట, రాజారాంపురం ప్రాంతాల్లో పర్యటించారు. అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. తుపాను ముప్పు ఉన్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలతో వంశధార, నాగావళి నదులు ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఉందని కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హెచ్చరించారు. మరోవైపు తుపాను పట్ల ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులను అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే.