- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టెప్పులేసిన ఏపీ డిప్యూటీ సీఎం.. డప్పుకొట్టిన ఎమ్మెల్యే
దిశ, ఏపీ బ్యూరో: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలు విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఘనంగా జరిగాయి. పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి హోదాలో ఈ వేడుకలకు హాజరైన ఆమె ఆదివాసీలతో కలిసి స్టెప్పులేశారు. ఆదివాసీల సంప్రదాయం ప్రకారం నృత్యాలు చేస్తూ అందర్నీ ఉత్సాహపరిచారు. గిరిజనులతో కలిసి సంప్రదాయ థింసా నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ భావన సైతం థింసా నృత్యం చేశారు. మరోవైపు పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు డప్పుకొడుతూ ఎంజాయ్ చేశారు. మెుత్తానికి ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఓ రేంజ్‌లో అదిరిపోయాయి. అంతకుముందు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గిరిజన మాత విగ్రహానికి అభిషేకం చేశారు. ఈ వేడుకల్లో ఐటీడీఏ అధికారులు, గిరిజన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.