‘బీఎస్ఎన్ఎల్ 4జీని ఆలస్యం చేస్తోంది’

by Harish |
‘బీఎస్ఎన్ఎల్ 4జీని ఆలస్యం చేస్తోంది’
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా 4జీ నెట్‌వర్క్‌ను అభివృద్ధికి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తోందని టెలికమ్యూనికేషన్ విభాగం(డీవోటీ) అభిప్రాయపడింది. చందాదారులకు హైస్పీడ్ డేటా సేవలను అందించేందుకు ఆలస్యం చేస్తున్నట్టు అటు బీఎస్ఎన్ఎల్, ఇటు డీవోటీ ఇరు విభాగాలు ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ రంగ టెలికాం బీఎస్ఎన్ఎల్‌కు నిరంతర ఆదాయం, చందాదారుల సంఖ్యల్లో నష్టాలకు దారితీస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

సుమారు 50 వేల 4జీ సైట్ల కోసం ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ తన దృష్టిని 2జీ, 3జీ నుంచి 4జీ వైపునకు దృష్టి సారించాలని డీవోటీ అంతర్గత కమిటీ సిఫారసు చేసింది. అయితే, ప్రైవేట్ ఆపరేటర్ల స్థాయిలో వేగవంతంగా సేవలనందించేందుకు ప్రయత్నిస్తే నష్టాలను చూడాల్సి ఉంటుందని, పైగా 2జీ నెట్‌వర్క్ నుంచి ఇప్పటికీ 60 శాతం ఆదాయం పొందుతున్నామని, 4జీ వైపునకు పూర్తిగా దృష్టి సారిస్తే సేవల నాణ్యత దెబ్బతింటుందని బీఎస్ఎన్ఎల్ సమాధానం ఇచ్చింది. 4జీ టెండర్ విషయంపై టెలికాం శాఖ సూచనలను బీఎస్ఎన్ఎల్ పాటించాల్సి ఉంటుందని బీఎస్ఎన్ఎల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Next Story