- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూరో కప్‌లో సంచలనం.. సెమీస్‌లో ఆ రెండు జట్లు
దిశ, స్పోర్ట్స్: యూరో కప్ 2020 చివరి అంకానికి చేరుకున్నది. శనివారం జరగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో డెన్మార్క్ జట్టు 2-1 తేడాతో చెక్ రిపబ్లిక్‌పై విజయం సాధించి సెమీ ఫైనల్ చేరుకున్నది. ఆట ప్రారంభమైన 5వ నిమిషంలోనే థామస్ డిలేనీ గోల్ కొట్టి డెన్మార్క్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. తొలి ఆఫ్ మరి కొన్ని నిమిషాల్లో ముగుస్తుంది అనగా కాస్పర్ గోల్బర్గ్ మరో గోలోతో డెన్మార్క్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఇక రెండో అర్దభాగం ప్రారంభమైన కాసేపటికే చెక్ ఆటగాడు పాట్రిక్ షిక్ గోల్ కొట్టి ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు. ఆ తర్వాత ఇరు జట్లు గోల్స్ చేయలేకపోవడంతో డెన్మార్క్ సెమీస్ చేరింది. 29 ఏళ్ల తర్వాత డెన్మార్క్ సెమీస్‌కు చేరడం గమనార్హం. మరో సెమీస్‌లో ఇంగ్లాండ్ జట్టు 4-0 ఆధిక్యంతో ఉక్రెయిన్‌పై తిరుగులేని విజయాన్ని సాధించింది. ఆట ప్రారంభమైన దగ్గర నుంచి ఇంగ్లాండ్ ఆటగాళ్లే ఆధిపత్యం సాధించారు. దీంతో పూర్తిగా ఏక పక్షంగా మ్యాచ్ కొనసాగింది. 25 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ జట్టు యూరో కప్ సెమీస్‌లోకి ప్రవేశించింది. బుధవారం ఇటలీ-స్పెయిన్ మధ్య తొలి సెమీస్. గురువారం డెన్మార్క్-ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీస్ లండన్‌లోని వింబ్లే స్టేడియంలో జరుగనున్నాయి.