- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ఉందని ఎగ్జామ్ రాయనివ్వలే
దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్షలో ఓ విద్యార్థినికి చేదు అనుభవం ఎదురైంది. తాను ఇచ్చిన సెల్ఫ్ డిక్లరేషన్ పత్రమే ఎగ్జామ్ రాయనివ్వలేదని విద్యార్థిని కన్నీరుమున్నీరుగా విలపించింది. వరంగల్ జిల్లాకు చెందిన సాయి వైష్ణవికి జిల్లా కేంద్రంలోని తల్లా పద్మావతి బీఫార్మాసీ కాలేజీలో సెంటర్ పడింది. విద్యార్థి సెల్ప్ డిక్లరేషన్ పత్రంలో గత 14 రోజుల్లో మీరేమైనా ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్నారా అనే కాలంలో తనకు పాజిటివ్ వచ్చిందని పేర్కొంది. అయితే 14 రోజుల క్రితం పాజిటివ్ వచ్చిందని చెబితే అధికారులు బయటకు పంపించారని విలపించింది. కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ ప్రత్యేక గదిలో పరీక్షలు రాయించేలా చర్యలు తీసుకున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజేన్సీ ప్రకటించింది. అయితే వరంగల్‌లో మాత్రం సాయి వైష్ణవి పరీక్షకు హాజరు కాలేకపోయింది. ఆరు నెలల నుంచి కష్టపడి చదివిందంతా వృథా పోయిందని వైష్ణవి కన్నీటి పర్యవంతమైంది.