- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేటెక్కువైనా ఓకే.. కానీ, మాకు ఇదే కావాలి
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రజలకు బుద్ధి సిద్ధించింది. మట్టి గణపతికి జై కొడుతున్నారు. ఇన్నాళ్లు ఎన్ని ప్రచారాలు చేసినా.., అవగాహన సదస్సులు నిర్వహించినా ఎవరూ మారలేదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలనే ప్రతిష్ఠించి పూజించేవారు. సుమారు 70 శాతం వరకు ప్రజలు రసాయనాలతో తయారు చేసిన ప్రతిమల వైపే మొగ్గు చూపేవారు. అయితే ఇన్నాళ్లు రాని మార్పు కరోనా వైరస్ తెచ్చింది. ప్రభుత్వం భారీ ప్రచారం చేయకపోయినా ఇంట్లోనే మట్టి విగ్రహాలను పెట్టుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.
కరోనా నేపథ్యంలో వినాయక మండపాలకు ప్రభుత్వం నో చెప్పంది. గతేడాది మహా నగర పాలక సంస్థ పరిధిలో సుమారు 32 వేల వినాయక మండపాలకు పోలీసు శాఖ అనుమతి ఇవ్వగా ఈ ఏడాది కరోనా ప్రభావంతో మండపాలు ఏర్పాటు చేయవద్దని చెప్పింది. కాగా, ప్రస్తుత వినాయక చవితి పూజల కోసం మూడు ఫీట్ల ఎత్తు వరకు విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మట్టితో తయారు చేసి మార్కెట్ లో విక్రయాలకు ఉంచారు. అయితే ఈసారి ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాల కొనుగోలుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో మట్టి వినాయక ప్రతిమలకు డిమాండ్ పెరిగిపోయింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాల కంటే మట్టి విగ్రహాల ధరలు అధికంగా ఉండడం వాటికి ఉన్న డిమాండ్ ఇట్టే తెలిసి పోతోంది. సుమారు మూడు అడుగుల ఎత్తులో తయారు చేసిన మట్టి వినాయక విగ్రహం రూ .10 వేల వరకు ఉండగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలు కేవలం రూ 3 వేలకే విక్రయిస్తున్నారు. వీటి బాటలోనే చిన్న విగ్రహాల ధరలు సైతం ఉన్నాయి.
కరోనా తెచ్చిన మార్పు..
రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఈ ఏడాది వినాయక మండపాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం కొంత కఠిన వైఖరిని ప్రదర్శించింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలతో పాటు నగరంలోనూ వినాయక మండపాలకు అనుమతులివ్వకపోవడంతో ఈ పర్యాయం సామూహిక పూజలకు తెరపడింది. దీనికి తోడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలను వినియోగించరాదని, మట్టి విగ్రహాలను మాత్రమే పూజించాలని ప్రచారం ఉధృతం చేయడంతో ప్రజల్లో భారీగా మార్పు వచ్చింది. దీంతో మార్కెట్లో మట్టి విగ్రహాల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు కరోనా తో అంతా చెడు మాత్రమే జరుగగా వినాయక విగ్రహాల విషయంలో మంచి జరిగిందని, ఇది భారీ మార్పును తీసుకొచ్చిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.