- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
MRO ఆఫీస్ సాక్షిగా లంచం డిమాండ్.. ధరణి పోర్టల్‌లో లొసుగులు.?
దిశ ప్రతినిధి, రంగారెడ్డి : రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం ప్రతీ సంస్థల్లో మార్పులు తీసుకొస్తున్నది. అందులో భాగంగానే ధరణీ వెబ్ పోర్టల్ ద్వారా రెవెన్యూ వివరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పోర్టల్‌తో రెవెన్యూ శాఖలో జరిగే అక్రమాలు, అవినీతికి అడ్డుకట్ట వేస్తామని ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చింది. కానీ, ధరణితో ప్రయోజనం లేదని స్పష్టమైంది. రంగారెడ్డి జిల్లాలోని ప్రతీ రెవెన్యూ కార్యాలయంలో వీఆర్ఏ, వీఆర్వో, ఆపరేటర్ల సహాయంతో తహసీల్దార్లు వసూల్‌లకు పాల్పడుతున్నారు. ఈ జిల్లాలోని భూముల ధరలకు రెక్కలు రావడంతో రెవెన్యూ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది అత్యధికంగా ఆశిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని ఓ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ సంస్థల ప్రతినిధులు వ్యవసాయ భూమిని నాలాగా మార్చాలని తహసీల్ధార్ కార్యాలయంలోని ధరణీ ఆపరేటర్ భరత్‌ను కలిశారు. నాలా కన్వర్షన్‌గా మార్చేందుకు రూ.7లక్షల 50వేలు ఈ చాలన్ కోసం ఖర్చు అవుతుందని ఒప్పంద ఉద్యోగి వివరించారు. ఇందుకు ఆ ప్రతినిధులు ఒప్పుకొని రూ.7లక్షల 15వేలు అప్పగించారు. అయినప్పటికీ ఆ ఉద్యోగి పనిచేయకపోవడంతో బాధితుల ద్వారా విషయం బహిర్గతమైంది. కానీ ఒప్పంద ఉద్యోగి ఈ చాలన్ అమౌంట్‌తో నకిలీ పత్రాలు రూపొందించి బాధితుడికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అయితే బాధితులు తెలివిగా నాలా కన్వర్షన్ కోసం ఎంత ఖర్చు అవుతుందని ఆరా తీయడంతో ఒప్పంద ఉద్యోగి భరత్ డిమాండ్ చేసిన నగదు విషయం తహసీల్దార్ కార్యాలయం సాక్షిగా బహిర్గతమైయింది. ఈ క్రమంలో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో నగదును తిరిగి ఇచ్చేందుకు వారిద్దరూ ఒప్పందం చేసుకున్నారు. కానీ, తమ అధికార కార్యక్రమాలకు, విధులకు ఆటంకం కలిగిస్తున్నాడని సదరు ఉద్యోగిపై తహసీల్దార్ మంచాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.