కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలు వివాదాస్పదం

by Shamantha N |
కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలు వివాదాస్పదం
X

బెంగళూరు: కరోనా పేషెంట్‌ల కోసం పడకలు సైతం లభించడం కష్టతరంగా ఉన్న నేటి పరిస్థితుల్లో కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలు వివాదాస్పదమవుతున్నాయి. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర ఉన్నతాధికారుల కోసం ఏకంగా లగ్జరీ రూంలను కొవిడ్ సెంటర్‌లుగా మార్చే ఆదేశాలను జారీ చేసింది. బెంగళూరులోని కుమార కృప ప్రభుత్వ గెస్ట్ హౌజ్‌లోని 100 డీలక్స్ రూంలను కొవిడ్ చికిత్సా సెంటర్‌లుగా మార్చనున్నట్టు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా చికిత్సలోనూ వీఐపీ సంస్కృతిని ప్రవేశపెట్టడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కుమార్ కృప గెస్ట్ హౌజ్‌ సామర్థ్యాన్ని 33శాతానికి తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఆదేశించింది. ఇందులోని ఒక వింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వ టూరిజం విభాగం పరిధిలో ఉన్నది. ఈ వింగ్‌లోని 100 డీలక్స్ రూంలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టాప్ ఆఫీసర్లకు కొవిడ్ చికిత్సనందించే సెంటర్లుగా మార్చాలని సూచించింది. రాజ్యాంగబద్ధ పదువుల్లో ఉన్నవారు, సీనియర్ అధికారులూ కరోనా బారిన పడుతున్నారని, వారికి చికిత్స ఇచ్చేందుకు ఈ గదులను కేటాయిస్తున్నట్టు పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed