యువతను నేరాలకు దూరం చేసేలా ‘యువ 2.0’

by Shyam |
Delhi Police
X

దిశ, ఫీచర్స్: యువతను నేరాలకు దూరంగా ఉంచేందుకు ఢిల్లీ పోలీస్ శాఖ ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ఈ మేరకు ‘యువ’ ఫ్లాగ్‌షిప్ కమ్యూనిటీ పోలీసింగ్ ఇనీషియేటివ్ ఆధ్వర్యంలో ‘యువ 2.0’ను అఫిషియల్‌గా లాంచ్ చేసింది. ఈ నెల 17న ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. వీధి బాలలు, యువతను సమాజంలో భాగం చేయడమే దీని ఉద్దేశ్యం. వివిధ డెవలప్‌మెంట్ ట్రైనింగ్స్ ద్వారా యువతలోని వాస్తవ సామర్థ్యాన్ని వెలికితీసి, సరైన అవకాశాలను కల్పించడం ద్వారా వారిని నేర ప్రపంచం వైపు మళ్లకుండా నిరోధించడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం.

YUVA అంటే ఏమిటి?

‘భద్రత, రక్షణకు సంబంధించి అనేక అడ్డంకులను ఎదుర్కోవడంలో ప్రజలకు, ఢిల్లీ పోలీసులకు మధ్య బంధాన్ని బలపరిచేందుకు YUVA 2.0 ఇనిషియేటివ్‌ మరో సరైన అడుగు’ అని కమిషనర్ అస్థానా తెలిపారు. జాతీయ రాజధానిలోని అన్ని జిల్లాల్లో అట్టడుగు, వెనుకబడిన వర్గాల యువతకు వివిధ ఉద్యోగ-సంబంధిత నైపుణ్యాభివృద్ధి, శిక్షణను అందించేందుకు నగర పోలీసులు తీసుకుంటున్న చొరవనే YUVA అని అధికారికంగా ప్రకటించారు.

కాగా ‘యువ 2.0’ ఆధ్వర్యంలో ఢిల్లీ పోలీసులు.. సాకేత్, మాల్వియా నగర్‌తో పాటు గ్రేటర్ కైలాష్‌లోని యువ శిక్షణా కేంద్రాల ద్వారా రిటైల్, హాస్పిటాలిటీ రంగాల్లో యువకులు, బాలికలకు సమగ్ర శిక్షణా కార్యక్రమాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా ఈ నెల 15 వరకు దక్షిణ జిల్లాలోని 835 మంది యువకులకు పలు విభాగాల్లో నైపుణ్య శిక్షణ అందించారు. వీరిలో సుమారు 600 మంది యువకులు జాబ్ ప్లేస్‌మెంట్/ఫెయిర్స్ డ్రైవ్‌ల ద్వారా వివిధ రంగాల్లో ఉద్యోగాలు కూడా పొందారు.

యువతకు స్ఫూర్తినిస్తూ..

‘నేరస్తుల తప్పులను సరిదిద్దడంతో పాటు వారిని సమాజానికి, తద్వారా జాతి నిర్మాణానికి సాయపడేలా మోటివేట్ చేయడమే లక్ష్యంగా ఢిల్లీ పోలీసులు పనిచేస్తున్నారు. శాంతియుత సమాజం కోసం నేరాల నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణకు బాధ్యత వహిస్తున్నప్పటికీ యువ వంటి కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల ద్వారా ఆ పనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు’ అని దక్షిణ జిల్లా కమిషనర్ రాకేష్ అస్థానా పోలీసులను ప్రశంసించారు.

Advertisement

Next Story

Most Viewed