- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎమ్మి అవార్డు సాధించిన ‘ఢిల్లీ క్రైమ్’
దిశ, వెబ్‌డెస్క్ : నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘ఢిల్లీ క్రైమ్’ బెస్ట్ డ్రామా సిరీస్‌గా ఇంటర్‌నేషనల్ ఎమ్మీ అవార్డు అందుకుంది. రిచి మెహతా డైరెక్షన్‌లో షెఫాలి షా, అదిల్ హుస్సేన్, రాజేష్ తైలంగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్.. ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఆధారంగా క్రైమ్ డ్రామాగా తెరకెక్కగా, నిందితుడిని పట్టుకునే క్రమంలో ఢిల్లీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ స్పెషల్ అకేషన్‌ను సెలెబ్రేట్ చేసుకుంటూ ఢిల్లీ క్రైమ్ యూనిట్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేయగా.. ఫిల్మ్ ఇండస్ట్రీ కంగ్రాట్స్ చెప్పింది.
This one is totally, totally deserved. A masterclass in long form story-telling. Great writing, casting, fantastic performances, terrific execution. My favorite show. Congratulations @RichieMehta, Pooja, Sanjay, Apoorva, Shefali, Adil, Rajesh, Vinod, Rasika and the entire team… https://t.co/f8ptUDsgmB
— Hansal Mehta (@mehtahansal) November 24, 2020
పురుషుల హింసను భరిస్తున్న మహిళలకు, ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న స్త్రీలకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నట్లు డైరెక్టర్ రిచి మెహతా ప్రకటించారు. గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి న్యాయ పోరాటంలో అలసిపోని తల్లికి, తన కుమార్తెకు సెల్యూట్ చేశారు. వారిద్దరి గురించి ఆలోచించకుండా రోజు గడిచిపోదన్న మెహతా.. ప్రపంచం వారిని మరిచిపోదని అన్నారు.
ఇక ఫిల్మ్ మేకర్ హన్సల్ మెహతా.. సోషల్ మీడియాలో టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ క్రైమ్ పూర్తిగా ఈ అవార్డుకు అర్హత కలిగివున్నదని అన్నారు. గ్రేట్ రైటింగ్, కాస్టింగ్, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, టెర్రిఫిక్ ఎగ్జికూషన్ కలిగిన సిరీస్.. స్టోరీ టెల్లింగ్‌లో మాస్టర్ క్లాస్ అని చెప్పాడు. తన ఫేవరెట్ షోకు ఈ అవార్డు లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపాడు.
నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ఢిల్లీ క్రైమ్ ఎమ్మి అవార్డు సాధించడం పట్ల ఇండియన్‌గా గర్వపడుతున్నానని తెలిపారు నవాజుద్దిన్ సిద్ధిఖీ. ఇండియన్స్‌కు ఇది సూపర్ ప్రౌడ్ మూమెంట్ అని చెప్పారు. తనతో పాటు స్వరా భాస్కర్, గునీత్ మొంగా, సుశాంత్ సింగ్, నీరజ్‌తో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు మూవీ టీమ్‌ను విష్ చేశారు.
కాగా బెస్ట్ కామెడీ సిరీస్‌కు నామినేట్ అయిన ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’ అవార్డు అందుకోలేక పోయింది.