- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి!
నిర్భయ దోషులకు తాజాగా మరోసారి డెత్ వారెంట్‌లు జారీ అయ్యాయి. మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని నిర్భయ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ విచారించి పటియాల కోర్టు ఈ తీర్పును వెలువరించింది. తాజా తీర్పుపై నిర్భయ తల్లి ఆశా దేవి సంతోషాన్ని వ్యక్తపరిచింది. ఈ తీర్పు సంతృప్తినిచ్చిందని అన్నారు. దోషులు.. క్షమాభిక్ష, క్యూరేటివ్ పిటిషన్లతో ఇప్పటికే పలుసార్లు ఉరిశిక్ష అమలును పొడిగించుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. నిర్భయ దోషులు ముఖేష్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ కుమార్‌లకు ఉరిశిక్ష అమలుకు మొదటిసారి జనవరి 22వ తేదీన ఫిక్స్ అయినా.. తర్వాత అది ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా పడింది. తాజాగా, వచ్చే నెల 3వ తేదీన ఉరి తీయాలని డెత్ వారెంట్ జారీ అయింది.