- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి

X
దిశ, వెబ్‌డెస్క్: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు సంస్థలకు సమన్లు పంపింది. ఏప్రిల్ 7న కోర్టుకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.
ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జీషీట్‌ను పరిగణలోకి తీసుకుని ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసు చిదంబరంను వదిలిపెట్టేలా లేదు. ఈ కేసులో గతంలో చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేయగా.. ఆయన బెయిల్‌పై బయటికొచ్చారు. ఇప్పుడు మళ్లీ ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేయడంతో కాంగ్రెస్‌లో ఆందోళన మొదలైంది.
Next Story