సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ టిప్స్.. బై అసిస్టెంట్ పోలీస్ కమిషనర్

by Shyam |
Assistant Commissioner of Police
X

దిశ, ఫీచర్స్: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో లక్షలాది మంది ఆయా పోటీ పరీక్షలకు తగ్గట్లుగా ప్రిపేర్ అవుతుంటారు. అందులోనూ యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమవడమంటే మాటలు కాదు. అయితే ఈ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుని ఉద్యోగం సాధించిన వాళ్లు.. ప్రస్తుతం ప్రిపేర్ అవుతున్న వారికి విలువైన సలహాలు, సూచనలు అందిస్తుంటారు. సీనియర్స్ కూడా గోల్డెన్ టిప్స్ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే 2018లో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన లక్షయ్ పాండే అనే ఐపీఎస్ అధికారి, ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కొన్ని చిట్కాలను పంచుకున్నాడు. ప్రస్తుతం అతను ఢిల్లీలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్‌గా చేస్తున్నాడు.

ప్రిపరేషన్ విధానం ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. లక్షయ్ స్వీయానుభవం ప్రకారం.. ‘ఏదైనా కోచింగ్, ఆన్‌లైన్ ఎగ్జామ్స్ కంటే సెల్ఫ్ స్టడీ ఉత్తమం. అంతేకాదు ‘మినిమం బుక్స్ చదువుతూ, మ్యాగ్జిమం రివిజన్ చేయడం ది బెస్ట్ ఆప్షన్. ఇక ఆరో తరగతి మొదలుకుని పదో తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతో పాటు మల్టిపుల్ బుక్స్, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ చదవడం ఏమంత ఉపయుక్తం కాదు’ అని చెప్తున్నాడు.

ఫాలో టిప్స్ :

మొదట ‘పుస్తకాలను కొనండి’.. ఇందులో ఎన్‌సీఈఆర్‌టీ 11వ తరగతికి చెందిన ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీతో పాటు ఫిజికల్ అండ్ హ్యుమన్ జియోగ్రఫి- గోహ్ చెంగ్ లియోంగ్, పాలిటీ- లక్ష్మీనాథన్, ఆధునిక చరిత్ర – స్పెక్ట్రం : రాజీవ్ అహిర్, ఎన్విరాన్‌మెంట్ నోట్స్- శంకర్ ఐఏఎస్, ఎకనామిక్స్- శ్రీ రామ్ ఐఏఎస్, సైన్స్ అండ్ టెక్నాలజీ – అంబాలికా స్మితి రచించిన ఎన్‌సీఈఆర్‌టీ సమ్మరీ.

ప్రతిరోజూ సమగ్రమైన టైమ్‌ టేబుల్‌ను అనుసరించడం. గంటకు మించకుండా వార్తాపత్రికల పఠనం, 4 నుంచి 5 గంటలు వివిధ సబ్జెక్టుల అధ్యయనం, శారీరక కార్యకలాపాలు, రిఫ్రెష్‌మెంట్ కోసం కుటుంబం, స్నేహితులకు కాస్త సమయం కేటాయిస్తూనే 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్ అని వెల్లడించారు. ఇక మొదటి 15 రోజుల్లో పాలిటీ చదివేసి, ఆ తర్వాత ఎకనామిక్స్, ఆధునిక చరిత్ర, భూగోళశాస్త్రం, పర్యావరణం, విజ్ఞాన శాస్త్రాలను 1.5 – 2 నెలల సమయాన్ని ఆయా సబ్జెక్టులకు కేటాయించి, రెగ్యులర్‌గా రివిజన్ చేస్తుండటంతో పాటు ఎప్పటికప్పుడు టెస్ట్ పేపర్స్, సిరీస్‌లను సాల్వ్ చేస్తుండాలి.

Advertisement

Next Story