- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక తెలంగాణలో ‘కేజ్రీవాల్’ రాజకీయం!
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ త్వరలో హైదరాబాద్‌కు రానున్నారు. వరుసగా మూడు సార్లు ఢిల్లీ పీఠాన్ని గెలిచి దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఆప్ రాజకీయాలు ఇక తెలంగాణలో మొదలు కానున్నాయి. రాష్ర్టంలో పార్టీకి క్యాడర్ ఉన్నప్పటికీ ఇప్పటిరకు ప్రజల్లోకి అంతగా వెళ్లలేదు. అయితే, ఢిల్లీ గెలుపు నేపథ్యంలో వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని, ప్రచారం కోసం కేజ్రీవాల్ ను సైతం హైదరాబాద్‌కు రప్పించాలని ఆ పార్టీ నిర్ణయిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని స్థానిక నాయకులు కేజ్రీవాల్‌ను కోరారు. ఆప్ తెలంగాణ రాష్ట్ర బాధ్యులు ప్రియాంక కక్కర్, రాష్ర్ట కన్వీనర్ రాము గౌడ్, జాయింట్ సెక్రటరీ రషీద్ ఉల్ హక్‌లు ఫిబ్రవరి 17న రాత్రి ఢిల్లీలో కేజ్రీవాల్‌ను కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కేజ్రీవాల్‌ను కోరారు. నగరంలో వివిధ ప్రాంతాల్లోని సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆ నాయకులకు కేజ్రీవాల్‌కు సూచించారు. ఇందుకోసం స్థానికంగా ఉండే అసోసియేషన్లు, సంస్థలు, వ్యక్తులను భాగస్వాములు చేయాలన్నారు. ముందుగా స్థానికుల్లో పార్టీపై నమ్మకం కలిగించడం ద్వారా విజయం సాధించడం సాధ్యమవుతుందన్నారు.
ప్రణాళికబద్ధంగా ఎన్నికలకు..
కేజ్రీవాల్ ఆదేశాల ప్రకారం.. ఆప్ నాయకత్వం ప్రణాళికబద్ధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. గ్రేటర్‌లోని 150 వార్డులకు బాధ్యులను నియమించి ఎలక్షన్ల బాధ్యతలను అప్పగించనున్నట్టు పార్టీ రాష్ర్ట నాయకులు తెలిపారు. స్థానికంగా ఉండే విద్యాసంస్థలు, ఆస్పత్రులను పార్టీ క్యాడర్ పరిశీలించి సమస్యలను గుర్తిస్తుంది. వార్డుల్లో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై పోరాటం చేయడం, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తద్వారా ఆప్ ను ప్రజలు విశ్వసించేలా చేయడమే ఢిల్లీ ముఖ్యమంత్రి చేసిన సూచనల్లో ముఖ్యమైనది. పార్టీ సభ్యత్వాల నమోదు కోసం ఈ నెల 23న ప్రత్యేక క్యాంపును కూడా ఆప్ చేపట్టనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ నెంబర్ కేటాయించి ‘ జాయిన్ రివల్యూషన్ – జాయిన్ ఆప్’ నినాదంతో మిస్ కాల్ ప్రోగ్రాం చేపట్టనున్నారు.