ఎర్రకోట హింస బీజేపీ కుట్ర : అరవింద్ కేజ్రీవాల్

by Shamantha N |
Delhi CM Arvind Kejriwal
X

లక్నో: కొత్తసాగు చట్టాలు డెత్ వారెంట్లని పేర్కొంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. సాగు చట్టాలతో రైతులు సొంత భూముల్లోనే కూలీలుగా మిగులుతారని అన్నారు. రైతులను దేశద్రోహులని కేంద్రం పిలుస్తున్నదని, వారి నిరసన ప్రాంతాల్లో నేలకు ఇనుప చువ్వలను దింపారని తెలిపారు. యూపీలోని మీరట్‌లో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బ్రిటీషర్ల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నదని, బ్రిటీషర్లు ఎప్పుడూ ఇంతలా రైతులను వేధించలేదన్నారు. ఫిబ్రవరి 26న ఎర్రకోట దగ్గర చోటుచేసుకున్న హింస బీజేపీ కుట్రేనని ఆరోపించారు. ఎర్రకోట హింస అంతా వారి ప్రణాళికే, రైతులది కాదని అన్నారు. వారే తమకు దారి తెలుసని రైతులను తప్పుదారి పట్టించారని తనతో చాలా మంది చెప్పారని వివరించారు. దేశాన్ని ప్రేమించేవారెవరూ ఈ నిరసనలకు వ్యతిరేకంగా నిలబడరని, తాను రైతుల ఉన్నత ఆందోళనలకు మద్దతిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం వీటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed