- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టగ్ ఆఫ్ వార్‌లో ఢిల్లీ గెలిచింది
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 13వ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ శిఖర్ దావన్ (45) పరుగులతో రాణించగా.. మరో ఓపెనర్ పృథ్వీ షా (7) పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరాశ పరిచాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ (33) పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. దీంతో 100 పరుగులకు ఢిల్లీ క్యాపిటల్స్ ముగ్గురు కీలక ఆటగాళ్లను కోల్పోయింది.
మరోవైపు ముంబై బౌలర్లు కూడా బ్యాట్స్‌మాన్‌లపై కాస్తా ఒత్తిడి తేవడంతో బౌండరీలు కష్టతరం అయ్యాయి. ఇదే సమయంలో క్రీజులో ఉన్న లలిత్ యాదవ్ వికెట్ ఆపుకుంటూ వచ్చాడు. దీనికితోడు మిడిలార్డర్‌లో వచ్చిన రిషబ్ పంత్ (7) పరుగులకే పెవిలియన్ చేరి అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. 17వ ఓవర్‌లో బుమ్రా వేసిన బంతిని షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 115 పరుగుల వద్ద ఢిల్లీ కెప్టెన్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి హెట్ మేయర్(14), లలిత్ యాదవ్ (22) పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. దీంతో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది.
ముంబై ఇన్నింగ్స్..
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లోనే అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ (44) పరుగులతో రాణించినా.. మరో ఓపెనర్ డీ కాక్ (1) పరుగు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (24), ఇషాన్ కిషన్ (26) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఇక మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు హార్దిక్ పాండ్యా (0), కృనాల్ పాండ్యా (1), కీరన్ పొలార్డ్ (2) దారుణంగా విఫలమయ్యారు. ఇక 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జయంత్ యాదవ్ (23) పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. అప్పటికే 19 ఓవర్లు ముగిశాయి. ఇక చివరి ఓవర్‌లో రాహుల్ చాహర్ (6) పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా ( 3), ట్రెంట్ బోల్ట్ (1) పరుగుతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో 20 ఓవర్లు పూర్తి కాగా.. ముంబై స్కోర్ 137 వద్ద ఆగిపోయింది.