ఓడినా ప్లే ఆఫ్స్‌కు చేరిన బెంగళూరు

by Anukaran |   ( Updated:2020-11-02 12:13:48.0  )
ఓడినా ప్లే ఆఫ్స్‌కు చేరిన బెంగళూరు
X

దిశ, వెబ్‌డెస్క్: షేక్ జాయేద్ క్రికెట్ స్టేడియం, అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్ 55వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్య విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆటగాళ్లు 19 ఓవర్లలోనే 154 పరుగులు చేసి మ్యాచ్‌ను కంప్లీట్ చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. వన్‌డౌన్ ప్లేయర్ అజింక్య రహనే(60), ఓపెనర్ శిఖర్ ధావన్ (54) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. పృథ్వీ షా(9), శ్రేయాస్ అయ్యర్ (7) పరుగులకే వెనుదిరిగినా.. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ (8), స్టోయినిస్(10) పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించారు.

కాగా, ఈ మ్యాచ్ విజయంతోనే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ చేరగా.. ఓటమి పాలైనా RCB కూడా ప్లే ఆఫ్స్‌కు చేరడం గమనార్హం. ప్రస్తుతం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లే ఆఫ్స్‌కు క్వాలి ఫై అయ్యాయి. ఇక మిగతా జట్ల భవితవ్యం రేపటి మ్యాచ్ మీద ఆధారపడి ఉంది.

బెంగళూరు ఇన్నింగ్స్:
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు యావరేజ్ స్కోరును నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 152 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో బెంగళూరు బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయగలిగారు. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ బాల్ టు బాల్ ఆడుతూ 41 బంతుల్లో 50 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఏబీ డివిలియర్స్ (35), విరాట్ కోహ్లీ (29) పరుగులతో రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్లు కనీసం 20 పరుగులు కూడా మించి చేయలేకపోయారు. తొలుత ఓపెనింగ్ వచ్చిన జోష్ ఫిలిప్ 12 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన క్రిస్ మోరిస్ డకౌట్ కాగా.. శివం దూబే (17) పరుగులు చేశాడు. ఇసురు ఉదాన 4 పరుగులు చేసి వెనుదిరిగాడు. నిర్ణీత 20 ఓవర్లు అయిపోయే సరికి వాషింగ్టన్ సుందర్(0), షాబాష్ అహ్మద్ (1) నాటౌట్‌గా నిలవడంతో 7 వికెట్ల నష్టానికి బెంగళూరు 152 పరుగులు చేయగలిగింది.

స్కోర్ బోర్డ్:
Royal Challengers Bangalore Innings: 152-7 (20 Ov)

1. జోష్ ఫిలిప్ c పృథ్వీ షా b రబాడా 12(17)
2. దేవదత్‌ పడిక్కల్ b నొర్ట్జే 50(41)
3. విరాట్ కోహ్లీ (c)c స్టోయినిస్ b అశ్విన్ 29(24)
4. ఏబీ డివిలియర్స్ (wk) రనౌట్ (రహనే/పంత్)35(21)
5. క్రిస్ మోరిస్ c పంత్ b నొర్ట్జే 0(2)
6. శివం దూబే c రహనే b రబాడా 17(11)
7. వాషింగ్టన్ సుందర్ నాటౌట్ 0(1)
8. ఇసురు ఉదాన c శ్రేయస్ అయ్యర్ b నొర్ట్జే 4(2)
9. షాబాజ్ అహ్మద్ నాటౌట్ 1(1)

ఎక్స్‌ట్రాలు: 4

మొత్తం స్కోరు: 152-7

వికెట్ల పతనం: 25-1 (జోష్ ఫిలిప్, 4.1), 82-2 (విరాట్ కోహ్లీ, 12.3), 112-3 (దేవదత్‌ పడిక్కల్, 15.4), 112-4 (క్రిస్ మోరిస్, 15.6), 145-5 (శివం దూబేe, 18.6), 146-6 (ఏబీ డివిలియర్స్, 19.2), 150-7 (ఇసురు ఉదాన, 19.4)

బౌలింగ్:
1. డేనియల్ సామ్స్ 4-0-40-0
2.రవిచంద్రన్ అశ్విన్ 4-0-18-1
3.ఎన్రిచ్ నొర్ట్జే 4-0-33-3
4. కగిసో రబాడా 4-0-30-2
5. అక్సర్ పటేల్ 4-0-30-0

Delhi Capitals Innings: 154-4 (19 Ov)

1. పృథ్వీ షా b సిరాజ్ 9(6)
2. శిఖర్ ధావన్ c శివం దూబే b షాబాజ్ అహ్మద్ 54(41)
3. అజింక్య రహనే c శివం దూబే b వాషింగ్టన్ సుందర్ 60(46)
4. శ్రేయాస్ అయ్యర్ c సిరాజ్ b షాబాజ్ అహ్మద్ 7(9)
5. రిషబ్ పంత్ నాటౌట్ 8(7)
6. మార్క్యూస్ స్టోయినిస్ నాటౌట్ 10(5)

ఎక్స్‌ట్రాలు: 6

మొత్తం స్కోరు: 154-4

వికెట్ల పతనం: 19-1 (పృథ్వీ షా, 1.5), 107-2 (శిఖర్ ధావన్, 12.4), 130-3 (శ్రేయాస్ అయ్యర్, 16.2), 136-4 (అజింక్య రహనే, 17.2)

బౌలింగ్:
1. క్రిస్ మోరిస్ 2-0-19-0
2. మహ్మద్ సిరాజ్ 3-0-29-1
3. వాషింగ్టన్ సుందర్ 4-0-24-1
4. ఇసురు ఉదాన 2-0-24-0
5. యూజువేంద్ర చాహల్ 4-0-29-0
6. షాబాజ్ అహ్మద్ 4-0-26-2

Advertisement

Next Story

Most Viewed