ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

by Aamani |
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పొందేందుకు ఈనెల 19 వరకు గడువు పొడిగించినట్లు రాష్ట్ర వెనుకబడిన తరగతులు గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్ లైన్ విధానంలో అడ్మిషన్లు పొందేందుకు గడువు తేదీ ముగియగా… కరోనా నేపథ్యంలో ఈనెల 19 వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. బీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Next Story