- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లోన్ యాప్‌ల పేరుతో జీవితాలతో చెలగాటం.. నిందితులు అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: ఆన్లైన్‌లో లోన్ యాప్‌ల పేరుతో రుణాలు ఇచ్చి, అనంతరం అధిక వడ్డీలు వసూలు చేసి వేధింపులకు గురిచేస్తున్న కేసులో హైదరాబాద్ పోలీసులు తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఆన్‌లైన్ యాప్‌లు షాంఘైలో రూపొందించినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ల్యాంబో సహా 28 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి జెన్నిఫర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
చైనాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో జెన్నిఫర్, వాంగ్ జియాంగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. 2019 నవంబర్‌లో ఢిల్లీలో 3 సంస్థలు ప్రారంభించి ఆన్ లైన్ యాప్ ద్వారా లోన్లు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేసినట్లు తేలింది. వచ్చిన లాభంను వర్జిన్ ఐల్యాండ్‌లో ఉన్న బినామీ అకౌంట్‌కు తరలించాలని, దశలవారీగా రూ.వందల కోట్లు షాంఘైకి తరలించినట్లు తేలింది. నిర్వాహకుల ఖాతాలో నుంచి రూ.315 కోట్లు పోలీసులు ఫ్రీజ్ చేశారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, ముంబై, ఢిల్లీలో ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపుల బాధితులు ఉన్నట్లు గుర్తించారు. నిర్వాహకుల వేధింపులు, అధిక వడ్డీలు కట్టలేక తెలంగాణలో ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. గత కొంతకాలంగా దర్యాప్తు చేస్తున్నారు.