విధిరాతకు భయపడని ‘మస్తానీ’ : దీపిక

by Shyam |
విధిరాతకు భయపడని ‘మస్తానీ’ : దీపిక
X

దిశ, వెబ్‌డెస్క్: సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో వచ్చిన ‘బాజీరావ్ మస్తానీ’ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హార్ట్ టచింగ్ నోట్ షేర్ చేసింది ‘మస్తానీ’ దీపికా పదుకొనే. సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోనూ తన పేరును ‘మస్తానీ’గా మార్చుకున్న బాలీవుడ్ దివా.. ఆ క్యారెక్టర్ ప్రాముఖ్యతను తెలుపుతూ నోట్ రాసింది. డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో ఉన్న పిక్ షేర్ చేసిన దీపిక.. హెవీ జ్యువెలరీ, హెవీ కాస్ట్యూమ్స్‌తో కూడిన స్టన్నింగ్ లుక్‌తో అదరగొట్టేసింది.

‘ప్రేమ లేదా యుద్ధం.. మస్తానీ తన అభిరుచికి ఆజ్యం పోసింది. మార్గం ఎంత ప్రమాదకరమైనదైనా.. తన విధిరాతను రాసుకునేందుకు భయపడలేదు. ఎవరి ముందు తల వంచలేదు.. ఎల్లప్పుడూ గౌరవం, ప్రేమతో నిలబడింది. సామాజిక పరిమితులను దహనం చేస్తూ శాశ్వతంగా తనను, తన ప్రేమికుడిని చరిత్రలో నిలిపింది’ అంటూ మస్తానీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ గురించి వివరించింది దీపిక. కాగా ఈ సినిమాలో దీపిక తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. రణ్‌వీర్ బాజీరావ్‌గా కనిపించగా.. మస్తానీగా ప్రేక్షకులను మరిపించింది దీపిక. ఇక బాజీరావు సతీమణి కాశీబాయిగా ప్రియాంక చోప్రా నటించి మెప్పించింది.

Advertisement

Next Story