తాప్సీ బిగిని షూట్.. దీపిక 2020 ఫేవరెట్

by Shamantha N |   ( Updated:2020-12-08 04:21:42.0  )
తాప్సీ బిగిని షూట్.. దీపిక 2020 ఫేవరెట్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ ఏడాది(2020లో) సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి. వాటిలో ఒక్కొక్కరికి ఒక్కో ఫేవరెట్ వీడియో ఉంటుంది. మరి బాలీవుడ్ దివా దీపికా పదుకొనేకు ఏ వీడియో నచ్చిందో తెలుసా? హీరోయిన్ తాప్సీ పన్ను మాల్దీవ్స్ ‘బిగిని షూట్’ వీడియో. నెల రోజుల క్రితం సిస్టర్స్‌ అండ్ బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మాల్దీవ్స్‌కు వెళ్లిన తాప్సీ.. అక్కడ వారం రోజుల పాటు ఎవ్రీ మినట్ సూపర్‌గా ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో ఫొటోలు అప్‌డేట్ చేసింది.

ఈ వెకేషన్ లాస్ట్ డే పన్ను సిస్టర్స్ బిగిని షూట్ సాంగ్‌పై చేసిన ఫన్నీ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్, బాలీవుడ్ సెలెబ్రిటీలు ఈ వీడియోపై సోషల్ మీడియాలో ‘బెస్ట్ థింగ్’ అంటూ కామెంట్ చేయగా.. అదే తన 2020 మోస్ట్ ఫేవరెట్ వీడియో అని చెప్పింది దీపిక.

Advertisement

Next Story