ఆయుష్మాన్‌ను కీర్తించిన దీపిక

by Anukaran |   ( Updated:2020-09-23 01:34:08.0  )
ఆయుష్మాన్‌ను కీర్తించిన దీపిక
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ అమెరికన్ మేగజైన్ ‘టైమ్’.. వెలువరించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన టాప్ 100 వ్యక్తుల జాబితాలో బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురాన్ నిలిచాడు. ఇండియన్ సినిమా నుంచి ఒకే ఒక్క నటుడు ఆయుష్మాన్.. ఈ లిస్ట్‌లో చేరడంపై ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్టిస్టుల్లో ఒకడిగా అతడు గుర్తింపు పొందడం పట్ల గర్వంగా ఫీల్ అవుతున్నారు. కాగా, టైమ్-100 లిస్ట్‌లో తన పేరు ఉండటం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు ఆయుష్మాన్.

ఇక ఆయుష్మాన్ ‘టైమ్ 100 లిస్ట్‌’లో చోటు సంపాదించుకోవడంపై సంతోషం వ్యక్తం చేసిన బాలీవుడ్ దివా దీపికా పదుకొనే.. ప్రశంసలు కురిపించింది. ఎంటర్‌టైన్మెంట్ బిజినెస్‌లో కథానాయకులు మూస ధోరణిలో వెళ్తూ బలైపోతారని.. కానీ ఆయుష్మాన్ మాత్రం విజయవంతంగా, నమ్మకంగా ఆ మూస పద్ధతులను సవాల్ చేసే పాత్రలుగా రూపాంతరం చెందాడని తెలిపింది. ‘ఇండియాలోని 1.3 బిలియన్ జనాభాలో కేవలం కొద్ది మంది మాత్రమే తమ కలలకు సజీవ రూపం ఇస్తారు. వారిలో ఒకరు ఆయుష్మాన్’ అని కొనియాడారు. ఇందుకు ప్రతిభ, కష్టపడి పనిచేయడం ఎలాగూ ఉంటుంది కానీ అంతకు మించి సహనం, పట్టుదల, నిర్భయత అవసరం అని తెలిపింది. కలలు కనే ధైర్యం ఉన్న వారికి అంతర్ దృష్టి ఉంటుందని చెప్తూ.. ఆయుష్మాన్‌కు శుభాకాంక్షలు తెలిపింది.

ఆయుష్మాన్ ఈ సంతోష సమయాన్ని చండీగఢ్‌లో తన ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటుండగా.. బాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్తున్నారు.

Advertisement

Next Story