మరోసారి షారుఖ్‌తో దీపిక రొమాన్స్?

by Jakkula Samataha |
మరోసారి షారుఖ్‌తో దీపిక రొమాన్స్?
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ దివా దీపికా పదుకొనె క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. బాలీవుడ్‌లో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్న దీపిక.. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ బాహుబలి ప్రభాస్‌తో నటించే చాన్స్ కొట్టేయగా.. ప్రస్తుతం మరో పాన్ ఇండియా మూవీకి సైన్ చేసినట్లు తెలుస్తోంది.

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌తో కలిసి ఇప్పటికే ‘ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రాల్లో నటించి, బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న దీపిక.. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ అందించేందుకు రెడీ అవుతోందని సమాచారం. ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో సినిమాకు షారుఖ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు రాగా.. ఈ ప్రాజెక్ట్‌లో దీపిక కూడా జాయిన్ కాబోతుందనే న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి ‘సంకి’ అనే టైటిల్ కూడా ఖరారైనట్లు టాక్.

ఇప్పటికే షారుఖ్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు చాలా చాలా వెయిట్ చేస్తున్న అభిమానులు.. దీపిక కాంబినేషన్‌లో సినిమా అని తెలిసి, సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ సక్సెస్‌ఫుల్ అండ్ బ్యూటిఫుల్ కెమిస్ట్రీని మరోసారి స్క్రీన్‌పై చూసేందుకు ఎగ్జైట్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed