- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధిష్టానానికి షాకిచ్చేందుకు టీఆర్ఎస్ ఓటర్లు రెడీ..!
దిశ ప్రతినిధి, కరీంనగర్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజా ప్రతినిధులు ఝలక్ ఇచ్చేందుకు సమాయత్తం అయ్యారా..? తమ అక్కసు తీర్చుకునేందుకు సరైన వేదిక దొరికిందని వారు అవకాశంగా మల్చుకుంటున్నారా..? అంటే అవుననే పరిస్థితులు కనబడుతున్నాయి. సంఖ్యా బలంతో తిరుగులేని శక్తిగా ఉన్నామని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలు తమవేనని ధీమాతో ఉన్న అధిష్టానానికి, అభ్యర్థులకు షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. పార్టీ ఆదేశాల మేరకు క్యాంపుల్లోకి చేరిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు చాలా మంది ప్రతీకారం తీర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నట్టుగా తెలుస్తోంది.
స్క్రూటినీ ముగిసిన తరువాత కొంతమంది అభ్యర్థులకు టీఆర్ఎస్ పార్టీ ఓటర్లు సమాచారం చేరవేస్తూ పోటీ నుండి ఎట్టి పరిస్థితుల్లో తప్పుకోవద్దని, ఖచ్చితంగా మద్దతు ఇస్తామంటూ మాట ఇస్తున్నారట. దీంతో అటు టీఆర్ఎస్ రెబల్స్‌తో పాటు ఇటు ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేసిన వారు కూడా ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. మెజార్టీ ఓటర్లు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నప్పటికీ వారి అండ తమకు ఉంటుందన్న స్పష్టమైన హామీ వస్తుండడంతో సమీకరణాలు జరుపుకునే పనిలో నిమగ్నం అయ్యారు కొంతమంది అభ్యర్థులు.
నిర్వీర్యానికి ప్రతిఫలమా..?
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల అధికారాలను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరించడంతో పాటు, ప్రాధాన్యత కూడా లేకపోవడంతో ఇంతకాలం నిశ్శబ్దంగా ఉన్న వారంతా తమ సత్తా చాటి అధికార పార్టీకి తగిన గుణ పాఠం చెప్పేందుకు సమాయత్తం అయినట్టుగా స్పష్టం అవుతోంది. అధికార పార్టీ కావడంతో ఇంతకాలం మౌనంగా ఉన్న వీరంతా ఇప్పుడు తమ ప్రతీకారాన్ని తీర్చుకుని అధిష్టానానికి కనువిప్పు కల్గించాలన్న యోచనలో ఉన్నారు.
ఎన్నికలు జరిగే వరకు తమపై మమకారం చూపిస్తూ, గెల్చిన తరువాత విస్మరిస్తున్నారన్న ఆవేదన కూడా వారిలో వ్యక్తం అవుతోంది. నామ మాత్రంగా మిగిలిపోయిన తాము ఉత్సవ విగ్రహాలుగా మారిపోయామని, మానసిక సంఘర్షణకు గురవుతున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఈ సారి టిట్ ఫర్ టాట్ అన్న రీతిలో తమ ఓటుతో సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నట్టుగా అర్థం అవుతోంది.