- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భయాలను వీడితేనే.. ఉత్తమ ఫలితాలు సాధ్యం
దిశ, ఫీచర్స్ : ముందుకు వెళ్లడానికి నాలుగు దార్లు ఉన్నప్పుడు.. అందులో ది బెస్ట్ రూట్‌ని మాత్రమే ఎంపిక చేసుకుంటాం. అయితే ఆ మార్గాలన్నింటిపైన పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ‘రైట్ డెసెషిన్’ సాధ్యమవుతుంది. ఈ సూత్రమే జీవితంలో ప్రతీ విషయంలోనూ వర్తిస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు, లైఫ్ కోచ్‌లు, వెల్ విషర్స్ ఎవరైన ఎల్లప్పుడూ ‘డెసిషన్ మేకింగ్’లో సాయం చేయలేరు. అంతేకాదు ఒంటరిగా, స్వతంత్ర్యంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే మనలో ఉన్నా సత్తా ఏంటో తెలుస్తుంది. దానివల్లే వచ్చే ఫలితం ఏదైనా భరించాల్సిందే. అయితే విజయం ఎల్లప్పుడూ ఒక నిర్ణయాన్ని అనుసరిస్తుందని, వ్యూహాత్మక నిర్ణయాలు ఒక వ్యక్తి కెరీర్ గమ్యంపై ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి. అందుకే జిందగీ చౌరస్తాలో ‘డెసెషిన్ మేకింగ్’ కీ రోల్ పోషిస్తుంటుంది. ఈ నేపథ్యంలో జీవితంలో అత్యంత ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయపడే కొన్ని సూచనలు అందించారు నిపుణులు.
డెల్ కంప్యూటర్ కొనాలా? ఆపిల్ కంపెనీది తీసుకోవాలా?, స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులో జాయిన్ కావాలా? లేదా? ఫ్రెంచ్ కోర్సు నేర్చుకోవాలా? ఇలాంటి చిన్న చిన్న విషయల్లోనూ నిర్ణయం తీసుకోవడానికి కొందరు కష్టపడతారు. ఇక మరికొందరు మైక్రోసాఫ్ట్‌లో ఆఫర్ చేసిన కొత్త ఉద్యోగాన్ని స్వీకరించాలా? లేదా ప్రస్తుతమున్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేయాలా? వంటి కెరీర్ ఇంపార్టెంట్ డెసెషిన్స్ తీసుకోవడంలో తడబడుతుంటారు. మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడంతో పాటు, నిర్ణయాత్మక సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటే ఈజీగా డెసిషన్స్ తీసుకోగలుగుతాం. మరో విషయం ఏంటంటే.. మానవ మెదడు అవసరమైన సమాచారాన్ని సేకరించే ముందు అది ఒక నిర్ణయానికి వెళుతుంది, మనం తెలుసుకోవలసిన దానికంటే మనకు ఇప్పటికే తెలిసిన వాటిపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఇక్కడే కాస్త వేగాన్ని తగ్గించి, విషయాలను జాగ్రత్తగా ఆలోచించాలి.
పర్‌స్పెక్టివ్
అదృష్టవశాత్తూ, మనం తీసుకునే చాలా నిర్ణయాలు తిరిగి పొందలేనివి లేదా ప్రాణాంతకమైనవి కావు. ఒకవేళ అది తప్పు అని తేలితే మన మనసు మార్చుకుని, రైట్ డెసిషన్ తీసుకోవచ్చు. దీనివల్ల కాస్త సమయం వృథా కావచ్చు కానీ ఆ అనుభవం నేర్పిన పాఠం వల్ల జన్మలో మరోసారి అలాంటి తప్పుడు నిర్ణయమైతే తీసుకోం కదా అన్నది గుర్తుంచుకోవాలి.
ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్
కారు లేదా ఇంటికి ఉపయోగపడే డివైజ్ కొనుగోలు చేస్తున్నా, ఉద్యోగ ఆఫర్‌ను తూకం వేసినా, పాఠశాల లేదా డేకేర్ ప్రొవైడర్‌ను ఎంచుకున్నా లేదా ఆరోగ్య పరిస్థితి గురించి పరిశోధన చేస్తున్నా.. ముందుగా దాని గురించి వీలైనంత వరకు తెలుసుకోండి. అనుభవజ్ఞులను అడిగి తెలుసుకుని అభిప్రాయాలు తీసుకోండి. ఇంటర్నెట్‌లో చిన్నపాటి రీసెర్చ్ చేయండి. ఆ తర్వాత మనకో క్లారిటీ వస్తుంది. లాభ, నష్టాలను అంచనా వేయండి అప్పుడు మంచి నిర్ణయం తీసుకోవడం చాలా సులభం. ఒకవేళ డెసిషన్ మరింత ముఖ్యమైంది అయితే నిపుణుల మార్గదర్శకత్వం పొందండి.
ఓవర్ థింకింగ్ వద్దు
మల్టిపుల్ చాయిస్ పరీక్షలో దాదాపుగా మనం మొదటగా అనుకున్న సమాధానం సాధారణంగా సరైనది ఉంటుంది. కానీ మనం ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆ జవాబు పక్కదారి పడుతుంది. అదేవిధంగా జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలోనూ ఇదే జరుగుతుంది. ‘ఓవర్ థింకింగ్’ మన క్రియేటివిటీని దెబ్బతీయడంతో పాటు, డెసిషన్ మేకింగ్ ఎబిలిటీని బలహీనపరుస్తుంది. సమస్యను మరింత సంక్లిష్టంగా మారుస్తుంది. ఒక రోజులో ఎంత ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటే మెదడు అంతగా అలసిపోతుంది. మెదడు శక్తి క్షీణిస్తున్నందున, ఉత్తమ నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఓవర్ థింకింగ్ వల్ల సమస్య ఏంటంటే.. అది ఆలోచనల పరంపరను కొనసాగిస్తూ, ముందుకు సాగేలా చేస్తుంది. దాంతో ఇది మనల్ని ఒకే చోట చిక్కుకుపోయేలా చేస్తుంది. ఆ పరిస్థితుల్లో డెసిషన్ మేకింగ్ మరింత కాంప్లెక్స్‌గా మారిపోతుంది. అందువల్ల ఓవర్ థింకింగ్ చేయకుండా తీసుకునే నిర్ణయం వల్ల కలిగే లాభ,నష్టాలను బేరీజు వేసుకుంటే సరిపోతుంది.
చాలా కష్టపడకండి
తీసుకున్న నిర్ణయం సరిగ్గా జరగలేదని తేలితే, మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. మీ వద్ద ఉన్న సమాచారంతో మీరు సాధ్యమైనంత ఉత్తమమైన ఎంపిక చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ హోంవర్క్ సరిగ్గా చేయకపోతే, తదుపరి మెరుగైన పని చేయడానికి సంకోచించకండి. లోపాలను సరిదిద్దుకుని వెళ్లడం వల్ల మరింత గొప్ప పనులు సాధించవచ్చని తెలుసుకోవాలి.
సామాజిక ‘శక్తులు’
మనం సామాజిక జీవులం.. మన చుట్టూ ఉన్న ప్రపంచం మన ఎంపికలను ప్రభావితం చేస్తుంది. ఇతరులు చేస్తున్న దాని వెంటే మనమూ పరుగెత్తే ప్రయత్నం చేస్తాం. మెజారిటీ ప్రజలు చేస్తున్నది మనం చేస్తున్నప్పుడు, వాటిని మనం సురక్షితంగా భావిస్తాం. ఆ నియమాలు మనకు పని చేయకపోయినా, సామాజిక నియమాలను అనుసరించడం వల్ల బోల్తాపడతామని మాత్రమే గ్రహించలేకపోతాం. డెసిషన్ తీసుకోవడంలో సామాజిక ప్రభావం ఉండకుండ, వ్యక్తిగత అభిప్రాయానికి విలువ ఇవ్వడం ఉత్తమం.
మోటివేషన్ ఫ్రమ్ నేచర్
సరైన మానసిక స్థితిలో లేనప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. పరిసరాలను శక్తివంతమైన, స్ఫూర్తిదాయకమైన సందేశాలతో నింపండి. ముఖ్యంగా ఉదయం వేళల్లో ప్రతికూల వార్తలను చదవవద్దు. నిరుత్సాహపరిచే ప్రకటనలకు మైళ్ల దూరంలో ఉండటానికి ప్రయత్నాలు చేయండి. వీలైనంత వరకు, ప్రతికూల ఆలోచనలు చేసే వ్యక్తుల సహవాసాన్ని నివారించండి. ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని రెట్టింపు చేసే పనులతో శరీరాన్ని, మెదడును చార్జ్ చేయండి. ప్రకృతికి దగ్గరగా ఉండటం వల్ల కొంత పాజిటివ్ ఎనర్జీ పొందొచ్చు. ప్రకృతి అత్యంత శక్తివంతమైనది. ఇది ఎల్లప్పుడూ ఉత్తమ నిర్ణయం వైపు మీకు మార్గనిర్దేశం చేస్తుంది. అందువల్ల క్లిష్టమైన విషయం గురించి ఆలోచిస్తుంటే, నాలుగు గోడల కంటే ప్రకృతి ఒడిలో ప్రశాంత వాతావరణంలో నిర్ణయం తీసుకోవడం ది బెస్ట్ ఆప్షన్.
సంగీత మంత్రం
యుద్ధ కాలంలో చాలా మంది సీనియర్ అధికారులు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు సంగీతం వింటారని, అది వారందరికీ మెడిటేషన్‌గా ఉపయోగపడుతుందని చెబుతారు. రెగ్యులర్ డే ఆపరేషన్ సమయంలో కూడా.. తప్పనిసరిగా మ్యూజిక్ బ్రేక్స్ తీసుకోవాలి. సృజనాత్మకతను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి సంగీతం ఉత్తమ మార్గం. మ్యూజిక్ బీట్స్ మానవుల నుంచి ఉత్తమమైన వాటిని బయటకు తెస్తుంది. నిర్ణయం తీసుకునేటప్పుడు సంగీతాన్ని వినడం వల్ల పాజిటివ్ వైబ్స్ కలిగి ఉత్తమ నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేయొచ్చు.
భయాలను వీడండి
విజయం ఎప్పుడూ సజావుగా, సులభంగా రాదు. కష్టమైన, ప్రమాదకరమైన మార్గాల గుండా నడవాలి. మీ ప్రయాణంలో అసంతృప్తికరమైన, ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. భయపడే మనస్సు దృఢమైన నిర్ణయాలు తీసుకోదు. భంగం కలిగించే నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భయాలు భాగం అనే వాస్తవాన్ని అంగీకరించండి.
ప్రతి నిర్ణయం మూడు ముఖ్యమైన కొలతలు కలిగి ఉంటుంది. ‘మై వ్యూ పాయింట్, యువర్ వ్యూ పాయింట్ అండ్ రియల్ ఇన్‌సైట్’. అందువల్ల నిర్ణయాధికారి మూడో కన్ను నుంచి చూడగలిగినప్పుడే ఉత్తమ నిర్ణయాలు తీసుకోవచ్చు.