- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిసెంబరు 31 డెడ్‌లైన్.. సిబ్బందిలో టెన్షన్.. టెన్షన్
దిశ, తెలంగాణ బ్యూరో: వంద శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసేందుకు మరో 5 రోజులే మిగిలి ఉన్నది. డిసెంబరు 31 వరకు వ్యాక్సిన్ పంపిణీని 100 % పూర్తి చేయాలని గతంలో సర్కార్ పెట్టిన గడువు సమీపంలోకి వచ్చేసింది. కానీ ఇప్పటికీ 20 జిల్లాల్లోనే 100% పూర్తి కాగా, మరో 13 జిల్లాల్లో సగటున 90 శాతం మందికి మాత్రమే పంపిణీ ముగిసింది. హైదరాబాద్, రంగారెడ్డి సహా రాష్ట్రంలోని మరో 18 జిల్లాల్లో వంద శాతం మంది వ్యాక్సిన్ ఫస్ట్ డోసు తీసుకున్నట్టు హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. దీంతో ప్రభుత్వం ఇచ్చిన గడువు లోపు లక్ష్యాన్ని చేధించాలని అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. స్వయంగా హెల్త్ మినిస్టర్ ఆదేశాలివ్వడంతో టాస్క్ పూర్తి కాకపోతే ఎలా? అని ఆందోళన చెందుతున్నారు దీంతో క్షేత్రస్థాయి సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది.
25 లక్షల మంది రెండో డోసుకు దూరం
మొదటి డోసు తీసుకొని రెండో డోసు పొందాల్సిన వారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది. రెండో డోసుకు వేసుకునేందుకు గడువు ముగిసినా వీరు ఇప్పటికీ తీసుకోలేదని స్పష్టమైంది. బాధ్యతాయుతంగా టీకాలు వేసుకోవాలని నొక్కి చెప్పింది. అత్యధికంగా కరీంగనగర్ 86%, హైదరాబాద్80%, రంగారెడ్డి 78%, హన్మకొండ 78% శాతం చొప్పున పూర్తి కాగా, గద్వాల జోగులాంబ, ఆదిలాబాద్, వికారాబాద్, కొమరం భీం జిల్లాల్లో సగటున 35 % మందికి మాత్రమే సెకండ్ డోసు పూర్తయింది.
వ్యాక్సిన్ వివరాలు..
అర్హులు: 2,77,67,000
మొదటిడోసు: 2,75,88,003
రెండోడోసు: 1,76,03561
- Tags
- deadline