ఉగ్రవాదికి ఉరిశిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు

by Shamantha N |   ( Updated:2021-03-15 07:13:46.0  )
ఉగ్రవాదికి ఉరిశిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ కేసులో ప్రధాన దోషి అరిజ్ ఖాన్‌కు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులను అత్యంత అరుదైనదిగా కోర్టు అభిప్రాయపడింది. అరిజ్ ఖాన్ ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాది. 12 ఏళ్ల క్రితం దేశంలో సంచలనం సృష్టించిన బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ కేసులో అతడు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2018లో అరిజ్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

2008 ఎన్‌కౌంటర్‌లో ఇన్‌స్పెక్టర్ మోహన్ చంద్ శర్మ మరణించారు. ఉగ్రవాదుల ఏరివేత కోసం బాట్లా హౌస్ ప్రాంతానికి పోలీసులు వెళ్లగా.. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మోహన్ చంద్ శర్మ వీరమరణం పొందారు. అయితే ఈ కేసులో మరో ఉగ్రవాది షాజాద్ అహ్మద్‌కు 2013లో కోర్టు జీవితఖైదు విధించింది.

Advertisement

Next Story