- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా లేకున్నా జేసీబీతో అంత్యక్రియలు..
దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా కష్టకాలంలో మనుషుల్లో మానవత్వం నశిస్తోంది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను హీనంగా ఖననం చేస్తున్నారు. విచిత్రం ఎంటంటే కరోనా లేకపోయిన ఓ యువకుడి మృతదేహాన్నిఆ గ్రామ సర్పంచ్ జేసీబీతో ఖననం చేయించారు.. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామపంచాయతీలో ఓ యువకుడు చనిపోయాడు. అతనికి కరోనా లేకున్నా.. ఉండొచ్చన్న అనుమానంతో అంత్యక్రియలకు సర్పంచ్ అడ్డుచెప్పాడు. కోవిడ్ పేషెంట్ మృతదేహానికి చేసినట్టుగానే జేసీబీతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించాడు. అంత్యక్రియలు చేసేందుకు కేవలం తల్లిదండ్రులకు మాత్రమే.. అది కూడా పీపీఈ కిట్లు వేసుకొనే వెళ్లాలని స్పష్టం చేశాడు. సర్పంచ్ ఆదేశాలతో గ్రామ సిబ్బంది యువకుడి మృతదేహానికి జేసీబీతోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనలో సర్పంచ్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.