- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంగానదిలో మరోసారి మృతదేహాల కలకలం
లక్నో: యూపీలోని గంగానది మరోసారి శవాల దిబ్బగా మారింది. శనివారం ఘాజీపూర్ గంగానదిలో మరోసారి పెద్ద సంఖ్యలో మృత దేహాలు కొట్టుకుని వచ్చాయి. దూరంగా ఉన్న ఇసుక దిబ్బల్లో శవాలు కూరుకుపోయి ఉండటాన్ని స్థానికులు గమనించారు. కాగా ఇటీవల కొవిడ్ మృత దేహాలను యూపీలోని గంగానదిలో పెద్ద ఎత్తున ఖననం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో గంగా నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు భయాందోలనలు చెందుతున్నారు. తాజాగా మరిన్ని శవాలు కొట్టుకు రావడంతో వారిలో ఆందోళన మరింత పెరిగిపోయింది. మృత దేహాలతో తమ గ్రామంలో కరోనా వ్యాపిస్తుందేమోనని భయంతో వణికి పోతున్నారు.
ఆ శవాలు ఇప్పటివి కాదు…
ఇటీవల బిహార్‌లోని బుక్సార్‌లో గంగానదిలో శవాలు కొట్టుకు వచ్చాయని వార్తలు వచ్చాయి. వాటికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీంతో వార్తల్లో వాస్తవాలు తెలుసుకునేందుకు కొందరు ఆంగ్ల మీడియా జర్నలిస్టులు రంగంలోకి దిగారు. ఈ మేరకు ఆ ఫోటోలన్నీ 2015లో యూపీలోని ఉన్నావోలో తీసినవిగా ఆయా వెబ్ సైట్లలో వార్తలు రాసుకు వచ్చాయి. ఇక యూపీలోని ఉన్నావోలో కూడా అలాంటివే శవాలు గుర్తించినట్టు వార్తలు వచ్చాయి. కాగా దీనిపై అక్కడి అధికారులు స్పందించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదనీ..జనాన్ని తప్పు తోవ పట్టించే వార్తగా తేల్చి చెప్పారు.
- Tags
- ganga river