- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరాఠా మందిర్‌లో DDLJ కంటిన్యూస్..
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఆఫ్ రొమాన్స్ షారుఖ్ ఖాన్..బ్యూటీఫుల్ కాజోల్ కెమిస్ట్రీ ఎవర్ గ్రీన్. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్. అందులో ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ మాత్రం చాలా స్పెషల్. లాంగెస్ట్ రన్నింగ్ ఇండియన్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమా..ఈ మధ్యే 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఇండియన్ ఐకాన్‌గా నిలిచిన ఈ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని అందిస్తూ లండన్‌లోని లీసెస్టర్ స్క్వేర్‌లో షారుఖ్, కాజోల్ కాంస్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే. కాగా, మహారాష్ట్రలోని మరాఠా మందిర్‌లో సినిమా విడుదలైనప్పటి నుంచి లాక్ డౌన్ ముందు వరకు కూడా సినిమా ఆడుతుండగా..కరోనా వల్ల బ్రేక్ పడింది. ‘మహా’ సర్కారు థియేటర్లు తెరిచేందుకు అనుమతించడంతో మరాఠా మందిర్‌లో సినిమా మళ్లీ ఆడనుందని తెలిపింది యాజమాన్యం. ఎప్పటిలాగే మరాఠా మందిర్‌లో మ్యాటినీ షోలో దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా ఆడుతుందని, ఆ సంప్రదాయం, ఆ మ్యాజిక్ కొనసాగుతుందని చెప్పారు.