- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మత్తు రహిత సమాజాన్ని నిర్మిద్దాం : DCP శ్రీనివాస్ రెడ్డి
దిశ, స్టేషన్ ఘన్‌పూర్: సమాజంలో అందరూ బాధ్యతగా ఉంటూ మత్తురహిత సమాజాన్ని నిర్మించేందుకు తోడ్పాటు అందించాలని డీసీపీ శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. గంజాయి, డ్రగ్స్ మొదలైన మాదకద్రవ్యాల నివారణ కోసం స్టేషన్ ఘన్ పూర్ ఏసీపీ రఘుచందర్, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐలు రమేష్ నాయక్, శ్రీనివాసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి స్థానిక బస్ స్టేషన్‌లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న గొప్ప సాయికృష్ణ(జఫర్గడ్), రడపాక కవి చందర్(తమ్మడపల్లి.ఐ), ఆకుల సాయి రాహుల్(హన్మకొండ)లను సోమవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రఘుచందర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్య రహిత వెస్ట్ జోన్‌గా తీర్చిదిద్దేందుకు సిబ్బంది నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
ఇందుకోసం 17 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. అరెస్టు చేసిన వారితో పాటు గంజాయి సరఫరా చేసే ఎండీ ఖాదర్, దుద్దిళ్ల రాజశేఖర్, సాయిలు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వెస్ట్ జోన్ పరిధిలో వందశాతం మత్తుపదార్థాల నివారణ కోసం గంజాయి సాగు, నిల్వ, రవాణా, ధూమపానంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. వీటి నివారణ కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించి సొసైటీ వాచ్‌గా పని చేయాలన్నారు. ఈ సందర్భంగా గంజాయి రవాణా చేస్తున్న వారిని పట్టుకున్న సిబ్బందిని అభినందించారు.
“హెల్మెట్ తప్పనిసరి”
రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్, మత్తు, వేగ నియంత్రణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పనిసరి అన్నారు. జోన్ పరిధిలో జరిగిన 104 ప్రమాదాల్లో 107 మంది మృతిచెందినట్లు తెలిపారు. గతేడాదితో పోల్చుకుంటే ప్రమాదాలు తగ్గాయని అన్నారు. ఈ సమావేశంలో ఏసీపీ రఘుచందర్, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐలు రమేష్ నాయక్, శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.