భారీగా నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న డీసీఎం సీజ్

by Sumithra |
భారీగా నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న డీసీఎం సీజ్
X

దిశ, రాజేంద్రనగర్ : గుట్టుచప్పుడు కాకుండా నకిలీ పత్తి బీటీ విత్తనాలను డీసీఎంలో హైదరాబాద్ తరలిస్తుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొండుపల్లి చెక్ పోస్ట్ వద్ద జరిగింది. శంషాబాద్ ఇన్స్‌స్పెక్టర్ ప్రకాష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా పాణ్యం నుండి నకిలీ పత్తి బీటీ విత్తనాలను ( AP 21 TS 9569) డీసీఎం వాహనంలో మేడ్చల్ తరలిస్తున్నారని పక్క సమాచారంతో శంషాబాద్ మున్సిపాలిటీ తొండుపల్లీ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలలో డీసీఎంను పట్టుకోవడం జరిగిందన్నారు.

డీసీఎంలో దాదాపు 4,191 కిలోల నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు గుర్తించామని, ఈ నకిలీ పత్తి విత్తనాల విలువ సుమారు 40 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. డీసీఎంను స్వాధీనం చేసుకొని ఇందులో ఉన్న డ్రైవర్ మధు, క్లీనర్ శివలను ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామని నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి, మదుసూదన్ రెడ్డి ఇద్దరు పరారీలో ఉన్నారని వారి గురించి గాలింపు ముమ్మరం చేశారు. గతంలో కూడా శ్రీనివాస్ రెడ్డి మధుసూదన్ రెడ్డి లపై నకిలీ పత్తి విత్తనాల కేసులు ఉన్నట్లు ఇన్స్‌స్పెక్టర్ ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed