2-18 ఏళ్లవారికి కొవాగ్జిన్..!

by Shamantha N |
2-18 ఏళ్లవారికి కొవాగ్జిన్..!
X

న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో మరో ముందడుగు పడింది. ‘భారత్ బయోటెక్‌’ సంస్థకు చెందిన ‘కొవాగ్జిన్’ టీకాను 2 నుంచి 18 ఏళ్ల పిల్లలపై ట్రయల్స్‌కు ‘డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’(డీసీజీఐ) గురువారం అనుమతిచ్చింది. ఎంపిక చేసిన 525 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై రెండు, మూడో దశ ట్రయల్స్ నిర్వహిస్తామని భారత్ బయోటెక్‌ వెల్లడించింది. ఈ ప్రయోగంలో మొదటి రోజున తొలి డోసు, 28వ రోజున రెండో డోసు ఇవ్వనున్నారు.

కాగా, పిల్లలపై కొవిడ్ టీకా ట్రయల్స్ జరగడం దేశంలో ఇదే తొలిసారి. వ్యాక్సిన్‌లపై నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్‌ను డ్రగ్ రెగ్యూలేటర్ ఆమోదించిందని కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ట్రయల్స్ ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ పాట్నా, నాగపూర్‌లోని మెడిట్రినా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ సహా వివిధ సైట్లలో నిర్వహించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed