కాంగ్రెస్ రైతు ధర్నాలో ఉద్రిక్తత.. డీసీసీ చీఫ్, కార్యకర్తలు అరెస్ట్

by Sridhar Babu |   ( Updated:2021-12-04 03:41:34.0  )
కాంగ్రెస్ రైతు ధర్నాలో ఉద్రిక్తత.. డీసీసీ చీఫ్, కార్యకర్తలు అరెస్ట్
X

దిశ, ధర్మపురి : ధర్మపురి మండలంలోని రాయపట్నం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలుపై రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. మధ్యాహ్నం రాయపట్నం గ్రామ జాతీయ రహదారిపై డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు.. రైతులతో కలిసి మహా ధర్నాలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు రాస్తా రోకో చేశారు. దీంతో రాస్తా రోకో త్వరగా ముగించాలని ఎస్ఐ కిరణ్ కుమార్ కోరారు.

ఈ సందర్భంగా మేము రైతుల కోసం రోడ్డు మీదకు వచ్చామని.. ప్రభుత్వమే రైతులను మోసం చేస్తున్నదని, మిల్లర్లు రైతులను దోచుకొని తింటున్నా జిల్లా కలెక్టర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని లక్ష్మణ్ కుమారు ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్ఐ తన సిబ్బందితో కలిసి లక్ష్మణ్ కుమార్‌ను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిని ఒకరు తోసుకున్నారు. లక్ష్మణ్ కుమారును వెంటనే పోలీస్ వాహనంలో ధర్మపురి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed