- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'టైటిల్ గెలిచాక క్యూ కట్టిన స్పాన్సర్లు'
క్రికెట్‌తో పాటు మరే ఇతర క్రీడల్లో అయినా విజేతలకు లభించినంత ఆదరణ, పేరు ప్రఖ్యాతులు, డబ్బు.. చివరి స్థానాల్లో నిలిచిన వారికి రావు. కనీసం వారిని పట్టించుకునేవాళ్లే ఉండరు. కానీ, కొన్ని సందర్భాల్లో అలా పట్టించుకోకుండా వదిలేసిన వాళ్లే ప్రపంచ విజేతలవుతారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాం. అలాంటి ఒక జ్ఞాపకాన్నే టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ప్రతి ఏటా బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్ తొలి సీజన్ 2008లో ప్రారంభమైన విషయం తెలిసిందే. 2007లోనే భారత జట్టు తొలి టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకోవడం.. స్వదేశీ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా కలిసి ఆడుతుండటంతో ఐపీఎల్ తొలి సీజన్‌లోనే బంపర్ హిట్ అయ్యింది. తొలి సీజన్‌లో ఎలాంటి అంచనాలు లేని రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలవగా.. హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న డక్కన్ చార్జర్స్ జట్టు చివరి స్థానంలో నిలిచింది. దీంతో రెండో సీజన్‌కు వచ్చేసరికి డక్కన్ చార్జర్స్ జట్టుకు స్పాన్సర్లే కరువయ్యారు. దీనికి తోడు 2009లో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఐపీఎల్ వేదికను దక్షిణాఫ్రికాకు మార్చారు.
ఐపీఎల్ రెండో సీజన్‌లో తక్కువ ట్రైనింగ్ కిట్స్, దుస్తులతోనే దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టామని అప్పటి డక్కన్ చార్జర్స్ జట్టు సభ్యుడు ఓజా చెప్పడం బయటపెట్టాడు. జట్టులోని సభ్యులందరూ సరైన కిట్స్, దుస్తులు లేవని బాధపడుతున్న సమయంలో కెప్టెన్ గిల్‌క్రిస్ట్ అందరినీ పిలిచి.. ‘కిట్స్, ట్రాక్స్ లేవని బాధపడొద్దు.. ఆటపైన దృష్టిపెట్టండి.. ఒక్కసారి మనం గెలవడం స్టార్ట్ చేస్తే మిగిలినవన్నీ అవే వస్తాయని’ హితవు పలికాడని తెలిపాడు. ఇక ఆ సీజన్‌లో పరిమిత వనరులతోనే నెట్టుకొచ్చిన డక్కన్ చార్జర్స్ జట్టు ఏకంగా ఐపీఎల్ ట్రోఫీనే ఎగరేసుకొని పోయింది. తొలి సీజన్‌లో ఆఖరి స్థానంలో ఉన్న జట్టు రెండో సీజన్‌లో విజేత కావడంతో ఒక్కసారిగా డీసీ తలరాత మారిపోయింది. స్పాన్సర్లు క్యూ కట్టారు. బ్రాండ్ విలువ పెరిగిపోయింది. ఈ విషయాలన్నీ దగ్గర నుంచి చూసిన ఓజా.. ‘తనకు విజయంలో ఉండే అసలు మజా అప్పుడే తెలిసిందని’ చెప్పాడు.
2009లో డక్కన్ చార్జర్స్ జట్టు విజేతగా నిలవడంలో ఓజా పాత్ర కూడా కీలకమే. ఫైనల్లో ఓజా 3 వికెట్లు తీయడంతో రాయల్ ఛాలెంజర్స్‌పై 6 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీని అందుకుంది. ఆ సీజన్‌లో అన్ని వైపుల నుంచి వచ్చే ఒత్తిడిని గిల్‌క్రిస్ట్ ఒక్కడే భరించాడని.. జట్టు సభ్యులపై ఆ ప్రభావం పడనీయలేదని ఓజా చెప్పుకొచ్చాడు.
tags :IPL, Deccan Chargers, Gilchrist, Pragyan Ojha, Season 2