లాక్‌డౌన్ కాలంలో 16 కోట్ల మందికి నగదు లబ్ది!

by Harish |
లాక్‌డౌన్ కాలంలో 16 కోట్ల మందికి నగదు లబ్ది!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పబ్లిక్ ఫైనాన్షియల్ మేనెజ్‌మెంట్ సిస్టమ్(పీఎఫెమ్ఎస్) ద్వారా లాక్‌డౌన్ సమయంలో ఉపశమనం కలిగించడానికి 16.01 కోట్ల మంది పేద రైతులు, కార్మికులు, ఇతర నిరుపేద ప్రజల లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ(డీబీటీ) కింద రూ. 36,659 కోట్లకు పైగా బదిలీ జరిగినట్టు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఆదివారం తెలిపారు.

ప్రత్యక్ష ప్రయోజన బదిలీలను కేంద్రం మార్చి 24 నుంచి ఏప్రిల్ 17 మధ్య కేంద్ర పథకాల ద్వారా రూ. 27,442 కోట్లను చెల్లించారు. పీఎమ్-కిసాన్‌ కింద రైతులకు రూ. 17,733 కోట్లు, మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం కింద రూ. 5,406 కోట్లు, ఇందిరా గాంధీ జాతీ వృద్ధాప్య పెన్షన్ పథకం కింద రూ. 999 కోట్లు చెల్లించారు. అదనంగా రాష్ట్రాలు కలిసి రూ. 9,717 కోట్ల ప్రత్యక్ష ప్రయోజన బదిలీ చెల్లింపులు చేశాయి. నగదు ప్రయోజనం నేరుగా లబ్దిదారుడి ఖాతాలో జమ అవుతుంది. ప్రధాని గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీ కింద ప్రకటించిన నగదు ప్రయోజనాలను కూడా డీబీటీ ద్వారా బదిలీ చేస్తున్నారు. అలాగే, ఏప్రిల్ 13 వరకు 19.86 కోట్ల మహిళలకు జన్-ధన్ ఖాతాలకు రూ. 9,930 కోట్లు(ప్రతి ఖాతాకు రూ. 500) బదిలీ చేసినట్టు అధికారులు తెలిపారు.

గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో డీబీటీ చెల్లింపుల కోసం పీఎఫ్ఎమ్ఎస్ వినియోగం పెరిగింది. ఏడాది 45 శాతం పంపిణీ జరిగి రూ. 2.67 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 22 శాతం పెరిగి రూ. 1.84 లక్షల కోట్లు నమోదైనట్టు డీబీటీ భారత్ వెబ్‌సైట్ చెబుతోంది.

Tags : Rural, Livelihood, PFMS, Health, Public Financial Management, Mahatma

Advertisement

Next Story

Most Viewed