దయానంద్ దొరికేసాడు..

by Sumithra |
దయానంద్ దొరికేసాడు..
X

దిశ, వరంగల్ :
జర్నలిస్టు సునీల్‌ రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు దయానంద్‌ రెడ్డిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు.వివరాల్లోకి వెళితే.. ఈ నెల 2న ములుగు జిల్లా పస్రాలో డబ్బుల విషయంలో జరిగిన గొడవలో పలువురు దుండగులు నడిరోడ్డుపై‌నే ఇద్దరిపై కత్తులతో దాడి చేశారు.ఈ ఘటనలో జర్నలిస్ట్ సునీల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. హత్యచేసిన వారిలో ప్రధాన నిందితుడు దయానంద్ పరారీలో ఉండటంతో అప్పటి నుంచి పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

TAGS ;journal list sunil reddy murder, criminal arrest, warangal district, pasra

Advertisement

Next Story