- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్‌లో దగ్గరైన వార్నర్.. ఐపీఎల్‌కు దూరం కానున్నాడా?
దిశ, వెబ్‌డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ఆస్ట్రేలియర్ స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్. సన్ రైజర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్, ఇప్పటివరకూ హైదరాబాద్ జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. క్రికెట్‌తో తన అద్భుతమైన ఆటను చూపించిన ఈ క్రీడాకారుడు.. తనలో మరో కోణం ఉందని ఈ లాక్‌డౌన్ కాలంలో చూపించాడు. టిక్ టాక్ వీడియోలతో ఆకట్టుకుంటున్నాడు. ప్రధానంగా దక్షిణాది సినిమాలకు సంబంధించిన పాటలు, డైలాగ్స్‌తో వీడియోలను సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ.. అభిమానులను అలరిస్తున్నాడు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురం’లో సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ నుంచి బాహుబలి, సరిలేరు నీకెవ్వరూ, బాహుబలి, తాజాగా ఆచార్యతో పాటు అందరి హీరోల సాంగ్‌లు, డైలాగ్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన వార్నర్ ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరం అవుతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు.
ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా గాయపడ్డ వార్నర్ ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. అంతేగాకుండా అతను పూర్తిస్థాయిలో కోలుకోవాలంటే ఇంకా 9 నెలలు పడుతుందని ఆయన ఇటీవల ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించారు. అంతేగాకుండా గాయం మళ్లీ తిరగబెట్టడంతో వార్నర్ ఈసారి ఐపీఎల్‌లో ఆడటం కష్టమే అని క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు వెల్లడించింది. అయితే, లాక్‌డౌన్‌లో ఎంతో దగ్గరైన వార్నర్ ఐపీఎల్ దూరం కానున్నాడన్న వార్తను తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే పూర్తిగా బౌలింగ్‌పై ఆధారపడిన హైదరాబాద్ జట్టులో.. అంతంతమాత్రం ఉన్న బ్యాటింగ్ నుంచి వార్నర్ గాయం కారణంగా దూరం కావడం.. బ్యాటింగ్‌పై మరింత దెబ్బ పడనుందని తెలుస్తోంది. వార్నర్ లేకుండా జట్టును ఇతర ప్లేయర్లు నెగ్గుకురాగలా? లేదా అనేది అందరిలోనూ ఒక సందేహం నెలకొంది. మరి దీనిపై సన్ రైజర్స్ యాజమాన్య ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.