- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వార్నర్ అనుమతిస్తేనే అతడు జట్టులోకి!
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా యువ సంచలనం విల్ పుకోవిస్కి రాబోయే టీమ్ ఇండియా సిరీస్ కోసం ఎంపికైన విషయం తెలిసిందే. అయితే టెస్టు మ్యాచ్ తుది జట్టులోకి అతడు రావాలంటే వార్నర్ అనుమతి తప్పని సరి అని క్రికెట్ ఆస్ట్రేలియా అంటున్నది. గత కొంత కాలంగా వార్నర్‌తో కలసి జో బర్న్స్ ఓపెనింగ్ చేస్తున్నాడు. వీరిద్దరూ కలసి 27 ఇన్నింగ్స్‌లో 50.55 సగటుతో పరుగులు సాధిస్తున్నారు. ఇప్పుడు విల్ పుకోవిస్కి ఓపెనింగ్ చేయాలంటే జో బర్న్స్‌ను పక్కన పెట్టాలి.
మరి విజయవంతమైన జోడిని విడదీయడానికి డేవిడ్ వార్నర్ ఒప్పుకుంటాడో లేదో అనే అనుమానాలు ఉన్నాయి. అందుకే టెస్టు మ్యాచ్‌లకుముందే విల్ పుకోవిస్కిని తుది జట్టులోకి తీసుకోవాలా వద్దా అనే విషయాన్ని వార్నర్‌ను అడిగి నిర్ణయం తీసుకోవాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నది. అతను గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే విల్ పుకోవిస్కికి అవకాశం దక్కనున్నది. విక్టోరియాకు చెందిన విల్ పుకోవిస్కి ఇటీవల జరిగిన షీఫెల్ షీల్డ్ ట్రోఫీలో వరుసగా రెండు సెంచరీలు బాదాడు. దీంతో అతడు ఆస్ట్రేలియా జట్టులో స్థానం సంపాదించగలిగాడు.