- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Supreme Court: చెట్లు నరికివేయడం మనుషులను చంపడం కంటే దారుణం- సుప్రీంకోర్టు

దిశ, నేషనల్ బ్యూరో: పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేయడం మనుషులను చంపడం కంటే దారుణమని సుప్రీంకోర్టు(Supreme Court) పేర్కొంది. చట్టవిరుద్ధంగా నరికివేయబడిన ప్రతి చెట్టుకు రూ. లక్ష చొప్పున జరిమానా విధించింది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తాజ్ ట్రెపీజియం జోన్ (Taj trapezium zone) లో ఏకంగా 454 చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ విషయంలో మధురకు చెందిన దాల్మియా ఫార్మ్స్ కంపెనీ యాజమాన్యంపై తీవ్రంగా మండిపడింది. కొట్టేసిన చెట్ల స్థానంలో తిరిగి పచ్చదనం నెలకొల్పాలంటే కనీసం వందేళ్లు పడుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పర్యావరణానికి హాని కలిగించే వారి విషయంలో ఎలాంటి జాలి, దయ చూపాల్సిన అవసరం లేదని జస్టిస్‌లు అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. చెట్ల నరికివేతకు పాల్పడిన దాల్మియా ఫార్మ్స్ యజమానికి భారీ మొత్తంలో జరిమానా విధించింది. నరికివేసిన 454 చెట్లకుగాను ఒక్కో చెట్టుకు లక్ష రూపాయల చొప్పున ఫైన్ విధిస్తూ తీర్పు వెలువరించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలు
అదేవిధంగా తాజ్ ట్రెపీజియం జోన్ సమీపంలో మొక్కల పెంపకం చేపట్టాలని నిందితుడికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శిక్ష తగ్గించాలని నిందితుడి తరఫున లాయర్ కోరగా.. కోర్టు అందుకు ఒప్పుకోలేదు. 2019లో ఇచ్చిన ఆదేశాలను ఈ సందర్భంగా కోర్టు గుర్తుచేసింది. తాజ్ ట్రెపీజియం జోన్ పరిధిలో అటవీ ప్రాంతం కానిచోట, ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోని భూముల్లో చెట్ల నరికివేతకు అనుమతి తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని తీర్పు సందర్భంగా గుర్తుచేసింది.