CM Chandrababu:తలసరి ఆదాయంలో ఆ జిల్లా ఫస్ట్.. సీఎం కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
CM Chandrababu:తలసరి ఆదాయంలో  ఆ జిల్లా ఫస్ట్.. సీఎం కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆకాంక్షించారు. రెండో రోజు కొనసాగుతోన్న కలెక్టర్ల సదస్సులో జోన్-1 పరిధిలోని 6 జిల్లాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ల నుంచి 2025-26 యాక్షన్ ప్లాన్‌ను సీఎం సేకరించారు. ఈ క్రమంలో జిల్లాస్థాయిలో పాలనపై పలు సూచనలు చేశారు. కొత్తగా ఏర్పడిన అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కలెక్టరేట్లతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని తెలిపారు.

పాత జిల్లా కేంద్రాలతో సమానంగా కొత్త జిల్లా కేంద్రాలు, జిల్లాలు అభివృద్ధి చెందాలని సీఎం సూచించారు. అల్లూరి జిల్లాను పూర్తిగా సేంద్రియ సేద్యం దిశగా ప్రోత్సహించాలని, విశాఖ, అనకాపల్లి జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా కలెక్టర్లు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. ఇప్పటికే అనకాపల్లి జిల్లాకు భారీ పరిశ్రమలు వస్తున్నాయని, ఈ పరిశ్రమల్లో పనిచేసే వారికి వసతి సమస్య రాకుండా ఇళ్ల నిర్మాణాలను కూడా ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయంలో విశాఖ జిల్లాలో రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉందని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. రాష్ట్ర సగటు కన్నా విశాఖ ఎక్కువ తలసరి ఆదాయం సాధిస్తోందని అభినందించారు. విశాఖ తర్వాత అనకాపల్లి, అల్లూరి జిల్లాలు నిలుస్తున్నాయన్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా తలసరి ఆదాయంలో బాగా వెనకబడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు సూచించారు.

Next Story

Most Viewed